Thursday, May 2, 2024

కేజీఎఫ్2 ,పుష్ప మధ్య పోటీ తప్పదా ?

ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక విషయం ఏదైనా ఇట్టే వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం రాక్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కేజిఎఫ్ 2 సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజానికి జూలై 16 న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జూలై 16న సినిమా రిలీజ్ అయ్యేలా కనిపించట్లేదు. అందుకు దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయానికి వచ్చారు. అందుకు సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. మరోవైపు అదే రోజున అల్లుఅర్జున్ పుష్ప కూడా రిలీజ్ కానుంది. దీనితో ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాబోతుండటం తో చర్చ మొదలైంది.

తమ సినిమా ఉంటుండగా తెలుగు ప్రేక్షకులు ఎవరు కూడా కేజిఎఫ్ వైపు వెళ్లారని గట్టిగా చెబుతున్నారు బన్నీ ఫ్యాన్స్. కానీ మరికొంతమంది మాత్రం కేజీఎఫ్ కు ఉన్న క్రేజ్ చాలా ఎక్కువని టీజర్ కు కోట్లలో వ్యూస్ వచ్చాయని కాబట్టి కేజీఎఫ్ ను తక్కువగా అంచనా వేయడానికి లేదని అంటున్నారు. అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఫ్యాన్స్ మాత్రం ముందుగానే అంచనాలు వేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement