Friday, May 3, 2024

Manchu Vishnu | భ‌క్త క‌న్న‌ప్ప సెట్ లో ప్రమాదం.. మంచు విష్ణుకు గాయాలు!

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్ర‌స్తుతం త‌న డ్రీం ప్రాజెక్ట్ అయిన భ‌క్త క‌న్న‌ప్ప మూవీ లో న‌టిస్తున్నాడు. శ్రీ కాళహస్తిలో పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజీలాండ్ లో జ‌రుగుతోంది. ఇప్పటికే పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

కాగా, ‘కన్నప్ప’ షూటింగ్ సెట్ లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నటుడు మంచు విష్ణుకు గాయాలు అయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షూటింగ్ సమయంలో డ్రోన్ కెమెరా మంచు విష్ణు మీదికి దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆయన చేతులతో పాటు శరీరంపై మరికొన్ని చోట్ల గాయాలు అయినట్లు తెలుస్తోంది. దీంతో మూవీ యూనిట్ ఆయను చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు అతడికి చికిత్స అందించి కాస్త రెస్ట్ తీసుకోవాలని సూచించారట. ఇక‌, ఈ ప్రమాదంతో దర్శకుడు సినిమా షూటింగ్ నిలిపి వేసినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement