Friday, April 26, 2024

ఇది కదా రికార్డ్…1గం.45 నిమిషాల్లో 1 మిలియన్ ఫాలోవర్స్

ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినీ, రాజకీయ ప్రముఖులు తమ సినిమాలకు ప్రచారాలకు ఫ్లాట్ ఫార్మ్ చేసుకుంటున్నారు. అలాగే ఫాలోవర్స్ ని బట్టి రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అయితే ప్రపంచంలో మొదటి సారి కనీవినీ ఎరుగని రీతిలో కేవలం గంట 45 నిమిషాల లో వన్ మిలియన్ ఫాలోవర్స్ ని సాధించాడు ఓ సింగర్. అతను మరెవరో కాదు. కొరియన్ పాప్ సింగర్ టెయిల్. ఎన్సీటీ మ్యూజిక్ బ్యాండ్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచే సింగర్ టెయిల్ తాజాగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాడు.

అయితే, ఎంట్రీ ఇవ్వాగానే 1 మిలియన్ ఫాలోవర్స్ ని పోగేశాడు. అంత వేగంగా మిలియన్ మార్క్ దాటిన యూజర్ ఎవరూ లేరు. కాగా రెండు గంటల్లోపే వన్ మిలియన్ ఫాలోయర్స్ ని క్రాస్ చేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ టెయిల్ ను గుర్తించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement