Saturday, May 11, 2024

‘హౌస్ అరెస్ట్’ టీజర్

హౌస్ అరెస్ట్ టీజర్ ని రిలీజ్ చేశారు ఆ చిత్ర యూనిట్. పిల్లలను ఆకట్టుకునే వినోదాత్మక చిత్రం ఇది. ఈ మూవీలో ప్రముఖ కమెడియన్స్ శ్రీనివాస్ రెడ్డి..సప్తగిరి..అదుర్స్ రఘు..తాగుబోతు రమేష్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శేఖర్ రెడ్డి ఎర్ర తెరకెక్కిస్తున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ‘హౌస్ అరెస్ట్’ టీజర్ చూస్తుంటే దొంగతనానికి వెళ్లిన ఐదుగురు దొంగలను ఆ ఇంటిలోని ఐదుగురు పిల్లలు హౌస్ అరెస్ట్ చేసి ముప్పు తిప్పలు పెట్టడమే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. సిటీలో పేరుమోసిన గజదొంగలుగా శ్రీనివాస్ రెడ్డి – సప్తగిరి – రఘు – తాగుబోతు రమేష్ – జబర్దస్త్ వినోద్ కనిపిస్తున్నారు. చిచ్ఛర పిడుగుల్లాంటి సూపర్ కిడ్స్.. వాళ్ళ చేత చిక్కిన దుండగుల బ్యాచ్ మధ్య జరిగిన అల్లరిని చూపిస్తున్న ఈ టీజర్ అన్ని వర్గాలను అలరిస్తోంది. ఈ చిత్రానికి సంగీత సంచలనం అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. చోటా కె.ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నాడు. ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ ఈ చిత్రానికి సాహిత్యం రాశారు. ఈ చిత్రంలో అల్లరి రవిబాబు – రవి ప్రకాష్ – సునయన – కౌశిక్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్టార్లను కాకుండా కేవలం ఆర్టిస్టులను నమ్ముకుని చేసిన హోల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘హౌస్ అరెస్ట్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement