Sunday, May 5, 2024

విష్ణు విశాల్ తో ‘ఐశ్వర్యా రాజేష్’

హీరోయిన్ ఐశ్వర్యారాజేష్ ఓ లక్కీ ఛాన్స్ ని కొట్టేసింది. హీరో విష్ణువిశాల్‌ తన సొంత బ్యానర్‌ విష్ణు విశాల్‌ స్టూడియోస్‌పై నిర్మించనున్న ‘మోహన్‌దాస్‌’ చిత్రంలో ఆమెకు అవకాశం కల్పించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్‌లో వెల్లడించారు. ఓ యధార్థ సంఘటనతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మురళి కార్తీక్‌ దర్శకత్వం వస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. తనకు మూవీ చాన్స్‌ కల్పించిన విష్ణుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాగా, ప్రస్తుతం ఐశ్వర్య ఇటు కోలీవుడ్‌, అటు టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమల్లో బిజీగా వుంది. తెలుగులో నేచురల్‌ స్టార్‌ నాని నటిస్తున్న ‘టక్‌ జగదీష్‌’ చిత్రంలో నటిస్తోంది. అలాగే, ఇప్పుడు  విష్ణు సరసన నటించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement