Thursday, May 2, 2024

మార్చి 26న సైనా..థియేటర్ లో

మార్చి 26న సైనా చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.  ప్రముఖ ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ సిల్వర్‌స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది. ‘సైనా’ పేరుతో తెరకెక్కిన ఈ బయోపిక్‌ మార్చి 26న విడుదలవుతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. బాలీవుడ్ హీరోయిన్‌ పరిణీతి చోప్రా టైటిల్‌ పాత్రలో నటించింది. అమోల్‌ గుప్తా దర్శకత్వం వహించిన ఈ బయోపిక్‌ను భూషణ్‌కుమార్, క్రిషన్‌ కుమార్‌, సుజయ్‌ జైరాజ్‌, రషేష్‌ షా నిర్మించారు. ఓటీటీలో విడుదలవుతుందని ముందు వార్తలు వినిపించినప్పటికీ ఎట్టకేలకు ‘సైనా’ బయోపిక్‌ను నిర్మాతలు థియేటర్స్‌లోనే విడుదల చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement