Saturday, April 27, 2024

దృశ్యం2లో ‘వెంకీమామ’

ఇప్పుడు వస్తోన్న పలు చిత్రాలకి సీక్వెల్స్ కూడా వస్తున్నాయి. అలా దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా దృశ్యం 2 పేరుతో మూవీని తెర‌కెక్కించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 19న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశాడు. ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. దృశ్యం సీక్వెల్ మాస్టర్ పీస్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో దృశ్యం 2 చిత్రాన్ని రీమేక్ చేయాలని హీరో వెంకటేష్ కి  వ‌రుస మేసేజ్‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో దృశ్యం 2 డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్‌, నిర్మాత సురేష్ బాబుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులతో క‌లిసి వెంకీ దిగిన ఫొటోని విడుద‌ల చేశారు. దీంతో దృశ్యం 2 చిత్రాన్ని వెంకీ రీమేక్ చేయ‌నున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. కాగా, దృశ్యం 2 రీమేక్ రైట్స్‌ని సురేష్ బాబు ద‌క్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement