Friday, May 3, 2024

డిఎస్పీ కంపోజ్..సుకుమార్ స్టెప్స్

ఉప్పెన చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్  దేవీ శ్రీ ప్ర‌సాద్ కంపోజ్ చేసిన సాంగ్స్ కు మ్యూజిక్ ల‌వ‌ర్స్ ఫిదా అవుతున్నారు. బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా న‌టిస్తుండ‌గా..కృతిశెట్టి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలోని పాట‌లు మిలియ‌న్ల సంఖ్య‌లో వ్యూస్ సాధించి రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో రంగుల‌ద్దుకున్నా సాంగ్ అంద‌రి మ‌న‌సులు దోచేసింది. పాట‌ల ర‌చ‌యిత చంద్ర‌బోస్ రాసిన రంగుల‌ద్దుకున్నా పాట‌కు డీఎస్పీ గిటార్ వాయిస్తూ పాట పాడుతుంటే..డైరెక్ట‌ర్ స‌కుమార్ ఎంట్రీ ఇచ్చాడు. రంగుల‌ద్దుకున్నా ట్యూన్ సాగుతుంటే సుకుమార్ స్టైలిష్ స్టెప్పులేసి అద‌ర‌గొట్టాడు. బుచ్చిబాబు, డీఎస్పీ, చంద్ర‌బోస్ రికార్డింగ్ రూంలో ఉండ‌గా..సుకుమార్ స్టైలిష్ డ్యాన్స్  చేసిన‌ వీడియో ఇపుడు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement