Sunday, May 5, 2024

డబూ రత్నాని క్యాలెండర్ కోసం ‘విజయ్ దేవరకొండ’

ఫేమస్ క్యాలెండర్ డబూ రత్నాని క్యాలెండర్ కోసం ఫొటోషూట్ ని పూర్తి చేశారట యంగ్ హీరో విజయ్ దేవరకొండ. డబూ రత్నాన్ని క్యాలెండర్ షూట్ అంటే ఎంత ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలుసు. అయితే ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ డబూ రత్నాని క్యాలెండర్ షూట్ కు గ్రాండ్ డెబ్యూట్ ఇస్తున్నారు. 2021-డ‌బూ ర‌త్నాని క్యాలెండ‌ర్ షూట్ ను   పూర్తి చేశారు విజ‌య్ దేవ‌ర కొండ‌. ఈ విష‌యాన్ని డ‌బూ ర‌త్నాని ట్విట‌ర్‌లో  వీడియో ద్వారా షేర్ చేసుకున్నారు. నేను విజ‌య్‌తో కొన్ని వారాలుగా మాట్లాడుతున్నాను…విజ‌య్ క్యాలెండర్ షూట్‌ చేయాలనుకున్నారు. విజ‌య్ చాలా సంతోషంగా ఉన్నారు. అతను చాలా త్వరగా మరియు ఫోటోజెనిక్. విజ‌య్‌ పొడవాటి జుట్టుతో ఉన్న లుక్ , ఆటిట్యూడ్‌, వ్యక్తీకరణలతో నేను మ‌రింత ఎక్కువగా పనిచేశాను. గ‌తంలో ఎన్న‌డూ లేనట్వంటి అనుభవాన్ని విజ‌య్‌తో చేసిన‌ షూట్ ద్వారా పొందాను. విజ‌య్ ఎప్పుడూ ఇలాంటిది  చేయ‌లేదు. తాను ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని న‌టుల‌తో చేయాల‌ని ఈ సారి ఆలోచించాన‌ని డ‌బూ ర‌త్నానీ వీడియోను ట్విట‌ర్ లో పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement