Monday, May 6, 2024

కన్నుగీటిన బ్యూటీ..వైరల్ గా వీడియో

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాని కన్నుగీటిన వీడియో తెగ వైరల్ అవుతోంది. తెలుగు..హిందీ సినిమాల్లో నటిస్తూ సౌతిండియాతో పాటు ఇండియా వైడ్ గా మిలియన్లలో ఫాలోవర్లను పెంచుకుందీ బ్యూటీ. ప్రస్తుతం ఈ బ్యూటీ  హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మ‌నాలీలో అంద‌మైన లొకేష‌న్ల‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. మంచు ప‌ర్వ‌త ప్రాంతంలో పైనుంచి మంచు కురుస్తుంటే కెమెరా వైపు చూస్తూ క‌న్ను గీటుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.  కైరా ఉన్ని టోపీ , తెలుపు కార్డిగాన్ ను వేసుకుంది. స్నో గ్లో..అంటూ పోస్ట్ కు క్యాప్షన్ పెట్టింది.కార్తీక్ ఆర్య‌న్ హీరోగా న‌టిస్తోన్న భూల్ భూల‌య్యా 2 షూటింగ్ మ‌నాలీలో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం మ‌నాలీ వెళ్లింది కైరా అండ్ మూవీ టీం. 2007లో వ‌చ్చిన భూల్ భూల‌య్యా చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. అనీస్ బ‌జ్మీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మొద‌టి పార్టును ప్రియ‌ద‌ర్శ‌న్ డైరెక్ట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement