Friday, May 17, 2024

ఆయనతో నటించడం నా కల..

హీరో విజయ్ దేవరకొండ నా అభిమాన హీరో అని తెలిపింది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. కాగా వైజయంతీ మూవీస్ లో తన తొలి చిత్రం చేయడం ఆనందంగా ఉందని తెలిపింది. ఆమె హీరోయిన్ గా నటించిన చిత్రం ‘జాతి రత్నాలు’. నాగ్‌ అశ్విన్‌ నిర్మాత. అనుదీప్‌ కె.వి. దర్శకుడు. ఈ నెల 11న విడుదలకానుంది. ఈ సందర్భంగా  ఫరియా అబ్దుల్లా మాట్లాడింది.  హైదరాబాద్‌ నా స్వస్థలం. ఇక్కడే పుట్టిపెరిగాను. చిన్నతనంలోనే  కళల పట్ల ఇష్టం మొదలైంది. డ్యాన్సర్‌ కావాలని అనుకున్నా. అనుకోకుండా నటనపై మక్కువ ఏర్పడింది.  ఏడెనిమిదేళ్ల పాటు నాటకాల్లో నటించా.  ‘నక్షత్ర’ అనే వెబ్‌సిరీస్‌తో తొలిసారి కెమెరా ముందుకొచ్చా. లయోలా కాలేజీలో మాస్‌ కమ్యూనికేషన్‌ పూర్తిచేశా. కాలేజీలో జరిగిన ఓ వేడుకకు నాగ్‌ అశ్విన్‌ అతిథిగా హాజరయ్యారు. సినిమాల పట్ల నాకున్న ఆసక్తిని ఆయనకు వివరించా. నాగ్‌ అశ్విన్‌ ద్వారా ‘జాతిరత్నాలు’ సినిమాలో అవకాశం వచ్చింది. ఇందులో చిట్టి అనే యువతిగా కనిపిస్తా. జాతిరత్నాలుగా పిలవబడే ముగ్గురు తుంటరి యువకుల కథ ఇది. తెలుగులో విజయ్‌ దేవరకొండ నా అభిమాన హీరో. ఆయనతో సినిమా చేయాలనేది నా కల. డార్క్‌ కామెడీ నా ఫేవరేట్‌ జోనర్‌.  అలాగే అవకాశం వస్తే సైకో పాత్ర చేయాలనుందని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement