Friday, April 26, 2024

ఆకాష్‌ సక్సెస్‌ కొడతాడు

ఆకాష్‌ పూరి, కేతిక శర్మ నటిస్తున్న చిత్రం రొమాంటిక్‌. ఈనెల 29 విడుదల కాబోతోంది. పూరి జగన్నాథ్‌, ఛార్మీ నిర్మించారు. అనిల్‌ పాదూరి దర్శక త్వం వహించారు. రొమాంటిక్‌ గ్రాండ్‌ ప్రి రిలీజ్‌ వేడుక వరంగల్‌లో ఏర్పాటు- చేశారు. విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్ర మంలో సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌ మాట్లాడుతూ ఃః కథ వినగానే రొమాం టిక్‌గా ఫీల్‌ అయ్యాను. అందులోంచి వచ్చినవే ఈ పాటలుఃః అని అన్నారు.
దర్శకుడు అనిల్‌ పాదూరి మాట్లా డుతూ ఃఃఆకాష్‌, కేతిక అద్భుతంగా నటించారు. ప్రభాస్‌ గారు మా సినిమా -టైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఇప్పుడు విజ య్‌ దేవరకొండ గారు ఈవెంట్‌కు వచ్చి ప్రోత్సహించారుఃః అని అన్నారు.
హీరోయిన్‌ కేతిక శర్మ మాట్లా డుతూ ఃఃఆకాష్‌ అద్బుతంగా నటిం చారు. రమ్యకృష్ణగారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉందిఃః అని అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ మాట్లాడుతూ ఃః సినిమా పరిశ్రమకు హైద్రాబాద్‌ తరువాత వరంగల్‌ కావా లి. ఇది చాలా మంచి గడ్డ. విజయ్‌ దేవర కొండ మాఇంటి వాడు. వరంగల్‌కు వస్తే మా ఇంటికి తప్పకుండా వస్తాడుఃః అని అన్నారు.
హీరో ఆకాష్‌ పూరి మాట్లాడుతూ రొమాంటిక్‌ సినిమా ఎప్పుడు విడుద లవుతుందా అని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను. ఈ రెండు మూడేళ్లు ప్రాణం పెట్టి సినిమా చేశాం అని అన్నారు.
నిర్మాత ఛార్మీ మాట్లాడుతూ ఃఃఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వరంగల్‌లో పెట్టాం. అది పెద్ద సక్సెస్‌ అయింది. అదే సెంటిమెంట్‌తో రొమాంటిక్‌ ఈవెంట్‌ను ఇక్కడ పెట్టాంఃః అన్నారు.
పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ఃఃరమ్యకృష్ణ గారి వల్ల ఈ సినిమా జాత కం మారి పోయింది. ఈ సినిమాకు పని చేసిన వారంతా బాగా చేశారు. అందరికీ థాంక్స్‌. ముఖ్యంగా ఛార్మి. నా స్ట్రెంగ్త్‌. నాకు ఏ -టె-న్షన్‌ రాకుండా అన్నీ చూసు కుంటు-ంది ఆమె. థాంక్యూ ఛార్మిఃః అని అన్నారు. విజయ్‌ దేవరకొండ మాట్లా డుతూ. ఃఃసంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. కేతిక చాలా బాగుంది. ఆమెకు మంచి ఫ్యూచ ర్‌ ఉంది. ఇక మన హీరో ఆకాష్‌.. అతని లో ఓ ఫైర్‌ ఉంది. ఆకాష్‌ సక్సెస్‌ కొడతా డని నమ్ముతున్నా. మీ అందరికీ ఈ రోజు లైగర్‌ సినిమా గురించి ఓ క్లారిటీ- ఇద్దామనుకున్నా. డెస్టినీ పూరి గారిని మా లైఫ్‌ లోకి తీసుకొచ్చింది. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. లైగర్‌ సినిమాలోని ఒక్క విజువల్‌ చూస్తే అది మీకే అర్థమవుతుంది. మేము ఒక్కటే ఫిక్సయ్యాం. 2022లో లైగర్‌ తో ఇండియాని షేక్‌ చేయాలె. ఫిక్స్‌ అయి పోండి. అక్టోబర్‌ 29న రొమాం టిక్‌, 2020లో లైగర్‌తో వస్తున్నాంఃః అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement