Friday, April 19, 2024

విలువల వేలం

గుప్పిట మూసి ఉంచినప్పుడే అంతా లోగుట్టు. తెరచినప్పుడే అసలు బండారం బయటపడేది. అంతర్లీన కుంభకోణాలు బయటికి వచ్చినప్పుడు గాని అసలు సంగతి తెలియదు. ఇటీవల ఘనతవ#హంచిన ప్రపంచ బ్యాంకు సంబంధిం చిన అంశాలు కూడా ఇందుకు సాక్ష్యంగా నిలిచాయి. స్వదేశంలోని ప్రజలతోపాటు ప్రపంచంలోని ఇతర దేశాల వారు కూడా వాణిజ్య పరంగా ఫలానా దేశం ఏ స్థాయిలో ఉందో, సాపేక్షికంగా తెలుసుకోవాలనుకోవడం పలు కారణాలతో స#హజం. స##హతుకం. అలాగే అమెరికాలోని మంచి విద్యాసంస్థలు ఏమిటో! ఏది ఏ స్థాయిలో ఉందో ర్యాంకింగ్‌లో! వంటివి వాటికి సంబంధించిన వారే గాక అంతా ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. అలాగే ప్రపంచ వాణిజ్య పోటీలో ఎవరు? ఎక్కడ? అనేది కూడా వివిధ సందర్భాల్లో/ నిర్ణయాలలో పరిగణలోకి తీసుకుం టారు. ఇది సాధారణంగా ఏ రంగానికి సంబంధించినవి ఆరంగానికి చెందినవై ఉంటాయి.లేకుంటే పోలిక కుదరదు. మచ్చుకి మౌలిక సదు పాయాలు ఎక్కడ బాగుంటాయి? బ్రెజిల్‌ లోనా? ఇండోనేషియా లోనా? అనేది నిర్ణయించుకునేది ఈ ర్యాంకుల స్థాయి ప్రాతిపదికపైనే, పూర్తి విశ్వాసంతో. అవి సంస్థలైనా, దేశాలైనా తద్వారా ప్రయోజనం పొందాలనే నమ్మకంతోనే వీటిని పరిగణనలోకి తీసుకుంటాయి.
ఈ ర్యాంకులని ఏ స్థాయిలో ఎవరు అనేది అంకెల్లోనే నిర్ణయిస్తాయి. నిర్ధారిస్తాయి. అందుకు వివిధ గతకాలపు ప్రామాణికతలని పరిగణ లోకి తీసుకుంటాయి. ఏ దేశానికి ఆ దేశానికి విడిగా నిర్ణయించడంతో దానికి సంబంధించిన విషయ ప్రాతిపదికలే కీలకం. సంఖ్యలో దాని స్థానం ప్రపంచంలో దాని స్థాయిని తెలుపుతోంది. ఇది 11వ స్థానమా లేక 16 వ స్థానమా అన్నప్పుడు,వాటిని పొందడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పుడు, పొందడానికి ఎంతకైనా తెగిస్తారు.ఎం తవరకైనా వెళతారు. వాటిలో అవినీతి అవధులు దాటినా ఆశ్చర్యం లేదు. ప్రపంచ బ్యాంకు సంబంధించిన తాజా ఉదంతాలు తిరుగులేని విధంగా తెలియపరుస్తుందివే.
ప్రపంచ బ్యాంకు ప్రతి సంవత్సరం ఇచ్చే’ డూయింగ్‌ బిజినెస్‌’ ర్యాంకులు ఇవ్వడం విరమించడంతో దీని వెనుక అవినీతి కుంభకోణం వెలికిలోకి వచ్చింది. ప్రపంచాన్నంతా ఆశ్చర్యపరిచింది. ఈ నివేదిక ఇవ్వటం ప్రారంభం 2003 నుండి. దీనిలో 190 దేశాలకి ‘సులభతర వాణిజ్య విధానాల అమలులో సూచికలు'(ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజి నెస్‌ ఇండికేటర్స్‌) ద్వారా ప్రైవేట్‌ సంస్థలు వివిధ దేశాల్లో స్థాపించటా నికి, వాటి వృద్ధికి ఎంతగానో అందుబాటులోకి వచ్చాయి. దీనికై వారు నిర్దేశించిన ప్రాతిపదికలు తెలియటం ద్వారా వారి లోగుట్టు వెల్లడవు తుంది. అవి ఆయా దేశాల్లో పాలనాపరంగా నియంత్రణ ప్రక్రియలో బ్యూరోక్రసీ (అధికారగణం) పాత్ర,, వేగవంత నిర్ణయాలు/ అమలు , ఆస్తి #హక్కు/బదలాయింపులు, రుణ సదుపాయాలు లాంటివి కీల కమైనవి. ప్రపంచ బ్యాంకు ఇంకా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకునేవి ఆయా దేశాల్లో పెట్టుబడులకు గల అవకాశాలు, అభివృద్ధి చెందే దేశాల్లో తీసుకురావాల్సిన సంస్కరణలు ముఖ్యమైనవి. వారి ప్రతి పాదనలను పలు దేశాలలో వివిధ దశల్లో ప్రగతి శీలుర నుండి వ్యతి రేకత ఉంది. ఇవి బడుగు జీవుల సామాజిక భద్రత, పన్నుల విధాన భారం, పౌర జీవనంపై అనేక విధాల వ్యతిరేక ప్రభావం చూపి దీర్ఘకాల దుష్ఫలితాలు ఇస్తాయని. ఈ నివేదిక నిజ స్వరూపం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. దీనిలోని అనువంశిక సంఘర్షణ తేటతెల్లమౌతుంది. చైనా ఈ ప్రపంచ బ్యాంకులో మూడో అతిపెద్ద వాటాదారులు. అమె రికా జపాన్ల తర్వాత. ,కానీ అక్కడ లోప పూరిత చట్టాలు, రాజ్యం ఉక్కు పాదం లాంటివి కారణంగా డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల్లో వెనుక బడి ఉంటుంది. అయితే 2017లో ప్రపంచ బ్యాంకు తన పెట్టుబడిని పెంచుకునే ప్రయత్నంలో భాగంగా చైనాతో పాటు ఇతర దేశాలను సం ప్రదించింది. ఇదే సందర్భంలో చైనా 2018 రిపోర్టులో మంచి ర్యాం కింగ్‌ కోసం లాబియింగ్‌ చేసింది. అప్పటి బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ యోంగ్‌ కిమ్స్కి స#హచరులు, ముఖ్య కార్యదర్శి( పర్యవేక్షకులు) క్రిస్టలైన జార్జీయేవలు తమ సిబ్బందిపై చైనాకి మంచి ర్యాంకు కోసం ఒత్తిడి తెచ్చినట్లు ఇటీవల బయటి పరిశోధనా సంస్థ ప్రపంచ బ్యాంకు కోరికపై ఇచ్చిన అంతర్గత నివేదికలో పేర్కొన్నది. ఈ పరిశోధనల్లో సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, అజర్బైజాన్‌ కూడా ప్రపంచ బ్యాంకుని ప్రభావితం చేసినట్లు తెలిపింది.వెలికి రాని ఇంకెన్నిమురికి కూపాలున్నాయో? 2019 లోనే ప్రపంచ బ్యాంక్‌ నుండి తప్పుకున్న కిమ్‌ కి #హస్తం ఉన్నట్లు లేక ఆదేశించినట్లు ఇందులో ఆధారాలు లేవని తెలిపింది. అయితే సిబ్బంది ఆయన ఆదేశించి ఉండొచ్చు అన్నట్లుగా భావించి ఉండొచ్చు,అన్నది. అయితే జార్జియా #హస్తం చైనా డేటా మార్పిడిలో ఉన్నట్లు పేర్కొంది. ఆమె ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్య నిధి( ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌. దాని నైతిక విభాగం(ఎథిక్స్‌ ప్యానెల్‌) ఇప్పుడు దీనిపై దృష్టి పెట్టింది.తాను ఏ తప్పు చేయలేదంటున్నారామె. ‘వారు కనుగొన్నవి మూడు సార్లు పరిశీలించిన అనంతరం నిర్ధారణ అయింది,ఎలాంటి రాజకీయ ప్రయోజనాలకై డేటా లో మార్పు కోరలేదు’. అని ఒక ప్రకటనలో ఆమె తెలిపింది.సంబందితులు ఆమె ప్రస్తుత పదవిలో కొనసాగింపుపై చర్చ జరుగుతుందంటున్నారు.
ఈ ప్ర#హసనం అంతా తెలిపేది, అంతర్జాతీయ బ#హుళపక్ష సంస్థల్లో నానాటికీ పెరుగుతున్న లేక పెంచుకుంటున్న చైనా పలుకుబడికి అద్దంపడుతున్నాయి. ప్రపంచ బ్యాంకు విశ్వసనీయతకు మచ్చ రావటంతో అది ఈ వార్షిక నివేదికలను ఉపసం#హరించింది. దీని స్థానంలో మరింత కట్టుదిట్టంగా ఎలాంటి ప్రత్యామ్నాయం తీసుకు వస్తుందో చూడాలి. బ్యాంక్‌ రివ్యూ ప్యానెల్‌ ఏం ప్రతిపాదిస్తుందో చూడాలి. ర్యాంకింగ్‌లు వాటి స్థాయిలో అవి ప్రపంచానికి కొంత పారదర్శకత కలిగిస్తాయి. కానీ ప్రపంచానికి అంతకుమించి కావాలి. అది అవినీతి ర#హతంగా ఉండాలి. ఏ విధం గానూ కళంకితం కారాదు. స్థల, కాల, భౌగోళిక పరిమితుల కతీతంగా మానవాళి అవసరాలు తీర్చడంలో వాణిజ్య పాత్ర అసమానమైనది.
అలాగే విశ్వవ్యాప్తంగా మానవాళిని అనేక రూపాల్లో అంటిపెట్టు కుని ఉన్న ఆకలి, పేదరికం, నిరుద్యోగం, అవిద్య, అనారోగ్యం లాంటి వాటిని పారద్రోలేందుకు ముందుకు వస్తేనే వాటికి దీర్ఘకాలపు మనుగడ. అదే సమయంలో నేటి ప్రపంచాన్ని పీడిస్తున్న పలు రుగ్మతలయిన వాతావరణ కాలుష్యం, సైబర్‌ నేరాలు, ఆర్థిక అంతరాలు,పలు రూపాల ఉగ్రవాదులు, వివిధ స్థాయిలో వివక్షతలు, దేశాల మధ్య ఘర్షణలు/యుద్ధ వాతావరణం లాంటి వాటికి అనేక రీతుల్లో కారణమవడం శోచనీయం. వాటిని అన్నివిధాలా సమైక్యంగా పరి#హరించాలి.
ఈ ప్రయత్నంలో ఏవిధం గానూ మాన వీయ విలు వల్ని, నైతిక ప్రమాణాలను బలి పెట్టకూడదు. అవనిపైగల అట్టడుగు వారి ని అన్ని వేళలాఆదుకునేలా ఉండాలి. పెద్ద వాటాదారుల చెప్పుచేతుల్లో ఉండకూ డదు. అప్పుడే అంతర్జాతీయ సంస్థల ఉనికికీ, అవి వల్లించే సుద్దు లకు సార్ధకత. కపటం నాగ రికత సంకేతం ఎన్నటికీ కాదని మరువరాదు.

  • బి లలితానంద ప్రసాద్‌
    ( రిటైర్డ్‌ ప్రొఫెసర్‌)
    92474 99715
Advertisement

తాజా వార్తలు

Advertisement