Saturday, May 18, 2024

Whatsapp | వాట్సాప్‌ చానెల్‌లో పోల్‌ ఫీచర్‌..

గతేడాది చానెల్‌ ఫీచర్‌ను పరిచయం చేసిన సామాజిక మాధ్యమం వాట్సాప్‌, ప్రస్తుతం దాన్ని విస్తరించే పనిలోపడింది. ఈ క్రమంలోనే చానెల్స్‌లో పోల్‌ ఫీచర్‌ను క్రియేట్‌ చేయనుంది. ఇప్పటి వరకు గ్రూప్స్‌, చాట్స్‌కు మాత్రమే పరిమితమైన వాట్సాప్‌ పోల్స్‌, ఇకపై చానెల్స్‌లోనూ కనిపించనున్నాయి. వాట్సాప్‌కు సంబంధించి తాజా అప్‌డేట్స్‌ను అందించే వాబీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని పంచుకుంది.

సాధారణంగా వాట్సాప్‌లో పోల్స్‌ నిర్వహించే విధంగా చానెల్స్‌లోనూ పోల్స్‌ క్రియేట్‌ చేయొచ్చు. టెక్ట్స్‌ బాక్స్‌లో కనిపించే ఎటాచ్‌మెంట్‌ సింబల్‌పై క్లిక్‌ చేయగానే పోల్స్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకుని పోల్స్‌ క్రియేట్‌ చేయొచ్చు. అయితే, చానెల్‌ నిర్వహిస్తున్న వ్యక్తికి మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. పోల్స్‌లో ఎవరు పాల్గొంటున్నారనే విషయం చానెల్‌ క్రియేట్‌ చేసిన వ్యక్తులకూ తెలీదు. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. త్వరలో మిగతా వారికీ దర్శనమివ్వనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement