Friday, April 26, 2024

వొడాఫోన్‌ ఐడియా ఫ్రీ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్‌.. 9వ తేదీ వరకు అవకాశం

ఉగాది వేడుకలను దృష్టిలో పెట్టుకుని వొడాఫోన్‌ ఐడియా (వీ) తమ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఉచిత ఆస్ట్రాలజీ కన్సల్టేషన్‌ను హైదరాబాద్‌లోని ఎంపిక చేసిన వీ స్టోర్స్‌లో అందిస్తున్నది. ఈ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్‌ను ఏప్రిల్‌ 9వ తేదీ వరకు వొడాఫోన్‌ ఐడియా వినియోగదారులకు అందించేందుకు నిర్ణయించినట్టు సంస్థ తెలిపింది. హైదరాబాద్‌ నగరంలో ఈ ఆస్ట్రాలజీ సేవలు అందించడానికి ఎంపిక చేయబడిన వీ స్టోర్లు కొత్తపేట, ఏఎస్‌ రావు నగర్‌, మెహదీపట్నం, చందానగర్‌, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌ నగర్‌, అమీర్‌పేటతో పాటు కూకట్‌పల్లిలో ఉన్నాయన్నారు. ఈ స్టోర్స్‌లో పూర్తి ఉచితంగా జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వొడాఫోన్‌ ఐడియా వినియోగదారులు, వీ స్టోర్ల వద్ద ఈ ఉచిత కన్సల్టేషన్‌ పొందొచ్చు. ఈ సందర్భంగా వొడాఫోన్‌ ఐడియా ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ ఎస్‌ మురళీ మాట్లాడుతూ.. వీ స్టోర్ల వద్ద తమ వినియోగదారులకు మరింత విలువైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నామని తెలిపారు.

ఉగాది పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ-ఏపీ రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న వీ వినియోగదారుల కోసం ఈ ఆఫర్‌ తీసుకొచ్చినట్టు వివరించారు. దీంతో పాటు వీ హీరో అపరిమిత ప్లాన్స్‌ కూడా తీసుకొచ్చినట్టు తెలిపారు. ఇవి రూ.299 నుంచి ప్రారంభం అవుతాయన్నారు. ఇందులో మూడు ఆఫర్లు ఉంటాయని, వారాంతపు రోజుల్లో ఉపయోగించని రోజువారీ డేటాను సేకరించి.. వారాంతంలో దాన్ని ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. రాత్రి సమయం ఉచిత డేటా కూడా ఉంటుందని, రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రీపెయిడ్‌ కస్టమర్‌లు ఎటువంటి పరిమితులు లేకుండా.. అదనపు ఖర్చు లేకుండా అపరిమిత హైస్పీడ్‌ నైట్‌ టైం డేటాను యాక్సెస్‌ చేయవచ్చన్నారు. డేటా డిలైట్‌ కస్టమర్‌లు నెలలో రెండు సార్లు, రోజుకు 1 జీబీ హైస్పీడ్‌ డేటా బ్యాకప్‌ను పొందొచ్చని చెప్పుకొచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement