Friday, May 3, 2024

పెరుగుతున్న కరోనా కేసులు.. షాంఘైలో మరోసారి లాక్‌డౌన్‌ పొడిగింపు!

చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో లాక్‌డౌన్‌ మరోసారి పొడిగించారు. ఇప్పటికే నగరంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో తీవ్ర ఆంక్షలు విధించారు. కానీ, తాజాగా నగరం మొత్తం కఠిన ఆంక్షలను విధించారు. కానీ, తాజా నిర్ణయం నగరం మొత్తానికి వర్తించనుంది. చైనా ఆర్థిక రాజధానిగా పేరున్న ఈ నగరంపై కరోనా వైరస్‌ పంజా విసరడంతో రోజువారీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కఠిన నిబంధనలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇంటి బయటకు రావడానికి కూడా వీల్లేదు. దీంతో ఇక్కడి వారు ఆహారం, తాగునీటిని కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి తెప్పించుకొంటున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలు అసలు ఆన్‌లైన్‌లోనే ఉండకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఒక్కరోజే 16 వేల కొత్త కేసులు..
చైనాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజు రోజుకీ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 16,412 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ప్రారంభం నుంచి నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం అక్కడి అధికార వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం 27 ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించింది. ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో ఎక్కువగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారే ఉన్నారు. కొత్తగా నమోదవుతోన్న కేసుల్లో.. ఎక్కువగా లక్షణాలు లేని వారే ఉంటున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement