Sunday, April 28, 2024

HYD: టి-హబ్‌తో వెంచర్‌బ్లిక్ వ్యూహాత్మక భాగస్వామ్యం

హైద‌రాబాద్ : వివిధ దేశాల నడుమ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, విప్లవాత్మక ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లడానికి, హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ కోసం ప్రముఖ గ్లోబల్ ప్లాట్‌ఫారమ్ అయిన వెంచర్‌బ్లిక్, భారతదేశంలో అగ్రగామి సాంకేతిక ఇంక్యుబేటర్, యాక్సిలరేటర్ అయిన టి-హబ్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు వెల్లడించింది. వెంచర్‌బ్లిక్‌, దక్షిణాసియా ఆపరేషన్స్ హెడ్ డాక్టర్ కైలాష్ జియల్దాసాని, వెంచర్‌బ్లిక్ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ క్రిస్ లీ, టి -హబ్ సిఓఓ వింగ్ కమాండర్ (రిటైర్డ్) ఆంథోనీ అనీష్, సమక్షంలో ఈ సదస్సు హైదరాబాద్‌లోని టి-హబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలు అండ్ వాణిజ్య (ఐఅండ్ సీ) శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ (ఐటీఈ అండ్ సీ) డిపార్ట్‌మెంట్ జయేష్ రంజన్, ఐఏఎస్ హాజరయ్యారు.

ఈ పరిణామంపై వెంచర్‌బ్లిక్‌- దక్షిణాసియా ఆపరేషన్స్ హెడ్ డాక్టర్ కైలాష్ జియాల్‌దసాని మాట్లాడుతూ… తమ వైద్య పరికరాలలో 70-80శాతం భారతదేశం దిగుమతి చేసుకుంటుందన్నారు. భారతదేశం కోసం మాత్రమే కాకుండా ప్రపంచం కోసం, వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతను రూపొందించడానికి భారతీయ పారిశ్రామికవేత్తలను తాము శక్తివంతం చేయాలనుకుంటున్నామన్నారు.

వెంచర్‌బ్లిక్ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ క్రిస్ లీ మాట్లాడుతూ… వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలకు సరిహద్దులు లేని కారణంగా దేశాల మధ్య సహకారాన్ని సాధించడానికి తాము ఇక్కడ ఉన్నామన్నారు. భారతదేశంలో పుట్టిన ఒక ఆలోచన కొరియా, చైనా లేదా యూరప్‌లో ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు చేయగలదన్నారు. టి- హబ్ సిఓఓ వింగ్ కమాండర్ (రిటైర్డ్) ఆంథోనీ అనిష్ మాట్లాడుతూ… టి- హబ్ వద్ద, తాము ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలో అద్భుతమైన పరిష్కారాలను పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement