Thursday, April 25, 2024

ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టీవీలు, ఫ్రిజ్‌లు, మొబైళ్ల ధరలు

మీరు కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా? వేసవి వచ్చిందని ఏసీ కానీ ఫ్రిజ్ కానీ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి ఏసీలు, టీవీలు రిఫ్రిజిరేటర్లు, ఎల్‌ఈడీ లైట్స్, మొబైల్ ఫోన్ల ధరలు పెరగనున్నాయి. దిగుమతి చేసుకునే విడిభాగాలపై కేంద్రం 2021-22 బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ పెంచింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. మొత్తం కలిపి కనీసం 3-5% వరకు ధర పెరగొచ్చు. మరోవైపు అల్యూమినియం, స్టీల్ లాంటి ఇన్‌పుట్ మెటీరియల్ ఛార్జీలు పెరుగుతున్నాయి. రవాణా ఛార్జీలు భారంగా మారాయి. ఈ ఏడాది ఇప్పటికే టీవీ ధరలు రూ.3వేల నుంచి రూ.4వేలు పెరిగింది. త్వరలో ఈ ధర మరింత పెరగనుంది. అందుకే ఏం కొనాలన్నా ఈనెల 31లోపే కొనేయండి. లేకపోతే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement