Saturday, May 18, 2024

TS | సీఎం రేవంత్ రెడ్డితో కోకాకోలా ప్రతినిధులు భేటీ..

ప్రముఖ కూల్ డ్రింక్స్ తయారీ సంస్థ హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ (హెచ్‌సిసిబి) తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో పాలుపంచుకోవడానికి ముందుకు వచ్చింది. కంపెనీ ప్రతినిధుల బృందం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కోకా కోలా ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.3 బిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టింది. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌లో గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులతో పాటు సామాజికాభివృద్ధిలో తమ సంస్థ భాగస్వామ్యం అవుతుందని, అందుకు అనుగుణంగా ప్రాజెక్టులను విస్తరిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు.

అయితే పెట్టుబడులకు రక్షణతో పాటు పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని కంపెనీ ప్రతినిధులకు సీఎం హామీ ఇచ్చారు. కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానం అమల్లో ఉంటుందన్నారు. హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ (హెచ్‌సిసిబి) పబ్లిక్ అఫైర్స్ చీఫ్ హిమాన్షు ప్రియదర్శని, పలువురు కంపెనీ ప్రతినిధులు సిఎంను కలిసిన వారిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement