Sunday, December 10, 2023

ఏవియేషన్‌ మార్కెట్‌లో గట్టి పోటీ – ఇండిగో చీఫ్‌

న్యూఢిల్లిd : ప్రపంచంలోనే అత్యంత పోటీ ఉన్న ఏవియేషన్‌ మార్కెట్లలో భారత్‌ ఒకటని ఇండిగో సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ అభిప్రాపయడ్డారు. న్యూఢిల్లిdలో జరిగిన ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) సదస్సులో ఆయన మాట్లాడారు. పౌర విమానయాన రంగంలో భారత్‌ ఒక అద్భుతమన్నారు. ప్రపంచంలోని విమానయాన మార్కెట్లలో ఎక్కువ పోటీ ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి చెప్పారు. దేశీయ విమానయాన రంగంలో ఇండిగో 63 శాతం వాటాతో ప్రపంచలోనే అతి పెద్ద మార్కెట్‌గా ఉందని, అంతర్జాతీయ కార్యకలాపాలను కూడా విస్తరిస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -
   

ఇండిగోకు ప్రస్తుతం 300 విమానాలు ఉన్నాయి. వీటిలో దేశీయంగా 81, అంతర్జాతీయంగా 32 గమ్యస్థానాలకు సర్వీస్‌లను నడుపుతోంది. కరోనా తరువాత భారత విమానయాన రంగం వేగంగా బలంగా కోలుకుంటుందని పీటర్‌ ఎల్బర్స్‌ చెప్పారు. దేశ ఆర్ధిక వృద్ధి ఇండిగోను ముందుకు నడిపిస్తోంద న్నారు. అదే సమయంలో భారత వృద్ధికి ఇండిగో నెట్‌వర్‌ ్క అండగా ఉంటుందన్నారు.

టాటాలకు చెందిన ఎయిర్‌ ఇండియా ఎయిర్‌ బస్‌, బోయింగ్‌ల నుంచి 470 విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ఇచ్చింది. దేశ విమానయాన చరిత్రలో ఇదే అతి పెద్ద డీల్‌గా నిలిచింది. అయితే ప్రస్తుతం ఇండిగో దీన్ని అధిగమించింది. 2030-2035 మధ్య డెలివరీ కోసం ఇండిగో 500 విమానాలను అర్డర్‌ ఇచ్చింది. దేశ విమానయాన రంగంలో ఇండిగో అగ్రగామి సంస్థగా కొనసాగుతోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement