Sunday, April 28, 2024

ముఖేష్‌ అంబానీ ఇంటికి బెదిరింపులు – ఒకరి అరెస్ట్‌

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్‌ అంబానీ నివాసానికి, రిలయన్స్‌ ఆస్పత్రిని పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ మిస్టరీని ముంబై పోలీసులు చేధించారు. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్పత్రితో పాటు, అంబానీ నివాసం అంటిలియాకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేసిన వ్యక్తిని పోలీసులు గురువారం దర్భాంగ ఏ బ్లాక్‌ వద్ద గురువారం అరెస్ట్‌ చేసినట్లు ముంబై జోనల్‌ డీసీపీ నోట్‌పాల్‌ వెల్లడించారు. అంబానీ కుటుంబానికి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు దర్భాంగ ఏ బ్లాక్‌ వద్ద అరెస్ట్‌ చేశారని, నిందితుడు బీహార్‌కు చెందిన రాకేష్‌ కుమార్‌ మిశ్రాగా గుర్తించడం జరిగిందని ఆయన వెల్లడించారు.

హెచ్‌ ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్పత్రికి, అంబానీ నివాసముండే అంటిలియాను పేల్చేస్తామని బుధవారం రెండు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ఆస్పత్రిని. అంబానీ ఇంటిని పేల్చేస్తామంటూ ఆగంతకుడు ఫోన్‌ చేసి బెదిరించారు. అయితే, ఇంటికీ, ఆస్పత్రికి ఒకే మొబైల్‌ ఫోన్‌ నెంబర్‌ నుంచి ఫోన్‌ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుడిని తదుపరి విచారించిన అనంతరం వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆయన ప్రకటించారు. బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేయడం వెనుక ఉద్న ఉద్దేశ్యం తెలుసుకోవడంతో పాటు, నిందితుడి వెనుక ఉన్న వారి గురించి పూర్తి వివరాలు సేకరించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement