Wednesday, May 1, 2024

బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. రేట్‌, ఫీచ‌ర్స్ ఏంటో తెలుసా!

దేశంలో ఎలక్ట్రిక్ వాహ‌నాల డిమాండ్ రోజు రోజు కు పెరుగుతోంది. దీంతో భార‌త్ లో చాలా కంపెనీలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇండియన్ మార్కెట్లో ఇప్ప‌టికే లాంచ్ చేశాయి. ఇందులో చాలా కొత్త స్టార్టప్‌లు కంపెనీలు కూడా ప్రారంభం అయ్యాయి. దీంతో ఏ స్కూటర్ బెటర్, ఏది కాదనే ఆందోళన కస్టమర్లలో నెలకొంది. ఈ సంద‌ర్బంగా.. దేశంలో బడ్జెట్‌లో అందుబాటులో ఉండే 3 ఉత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌ల గురించి తెలుసుకుందాం..

- Advertisement -

TVS iQube

టీవీఎస్ మోటార్ తొలిసారిగా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిలీజ్ చేసింది. ఇది అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్ అనే చెప్పాలి. దీని లుక్, రేంజ్ రెండూ అద్భుతంగానే ఉంటాయి. ఈ బైక్ 3 కిలోవాట్ అవర్ బ్యాటరీని కలిగి ఉంది. ఛార్జ్ అవ్వ‌డానికి 5 గంటలు పడుతుంది. ఛార్జ్ చేసిన తర్వాత, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 100 కిలోమీటర్ల మైలెజ్ ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 78 కిలోమీటర్లు.
-1,61,000 ఎక్స్-షోరూమ్ ధర

Ola S1 స్కూటర్

Ola నుంచి వ‌చ్చిన‌ S1 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ రెండవ స్థానంలో ఉంది. ఈ బడ్జెట్ వేరియంట్ బైక్ పరిధి 120-150 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ స్కూట‌ర్ 3 కిలోవాట్ సామర్థ్యంతో బ్యాటరీని పొందుతుంది. పూర్తిగా ఛార్జ్ అవ్వ‌డానికి 5 గంటలు పడుతుంది. ఇది కాకుండా, దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు.
-97,000 ఎక్స్-షోరూమ్ ధర

ఏథర్ 450X

ఏథర్ 450x అనేది అతి త‌క్కువ స‌మ‌యంలో విపరీతమైన ప్రజాదరణ పొందిన అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది 2.3 kW కెపాసిటీ కలిగిన లిథియం ఎండ్ బ్యాటరీ ప్యాక్డ్ బైక్. ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవ్వ‌డానికి 6 గంటలు పడుతుంది. పూర్తి ఛార్జ్ తర్వాత ఇది 70 -85 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు.
-రూ.1.40 ఎక్స్ షోరూమ్ ధర

Advertisement

తాజా వార్తలు

Advertisement