Sunday, April 28, 2024

పెరగనున్న మొబైల్‌ ఫోన్ల ధరలు.. పండగల సీజన్‌ తర్వాత నిర్ణయం

దీపావళీ పండగ పూర్తయిన తరువాత మొబైల్‌ ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పండగల సీజన్‌లో ఇ-కామర్స్‌ సంస్థలు, కంపెనీలు కూడా, ఆఫ్‌లైన్‌ స్టోర్లు కూడా ఆఫర్లు ప్రకటించి భారీగా అమ్మకాలు జరుపుతున్నాయి. స్మార్ట్‌ ఫోన్లు కొనేవారికి ఇది మంచి అవకాశమని తాజాగా వెలువడిన సమాచారం తెలుపుతోంది. పండగ సీజన్‌ అయిన తరువాత అన్ని మొబైల్‌ కంపెనీలు వీటి ధరలను పెంచే అవకాశం ఉందని ఒక ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ప్రధానంగా బేసిక్‌ మోడల్‌ ఫోన్ల ధరలు కనీసం 7 శాతం వరకు పెరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలను ఉటంకిస్తూ ఈ కథనం వెలువడింది.

రూపాయి పతనంమే కారణం

మొబైల్‌ ఫోన్ల ధరలు పెరిగేందుకు రోజురోజుకు క్షిణిస్తున్న రూపాయి విలువనే కారణమని కంపెనీలు వెల్లడించాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ క్షిణిస్తూ వస్తోంది. దీని వల్ల మొబైల్‌ కంపెనీల ముడి వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. చాలా కంపెనీల మొబైల్‌ ఫోన్లు మన దేశంలోనే తయారు చేస్తున్నప్పటికీ, చాలా విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబ్లింగ్‌ చేస్తున్నాయి. ప్రధానంగా ప్రాసెసర్స్‌ను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. రూపాయి విలువ క్షిణించడంతో వీటి ధరలు పెరుగుతున్నాయి. దీంతో కంపెనీలు ఫోన్ల ధరలు పెంచాలని నిర్ణయించుకున్నాయి. ప్రీమియం ఫోన్లు, మిడ్‌ బడ్జెట్‌ ఫోన్ల కంటే బడ్జెట్‌ ఫోన్‌ మోడల్‌ మొబై ల్స్‌ ధరల్లోనే తేడాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే యాపిల్‌ ఐఫోన్‌ ధరలను మన దేశంలో కంపెనీ ఆరువేలు పెంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement