Monday, April 29, 2024

టాటా మోటార్స్‌ నష్టాలు తగ్గాయ్‌..

దేశీయ వాహన తయారీదారు టాటా మోటార్స్‌ నష్టాలను భారీగా తగ్గించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి కంపెనీ నికరనష్టం రూ.945 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఆర్జించిన రూ.4,442 కోట్ల నష్టంతో పోలిస్తే మూడింతలకు పైగా తగ్గించుకోగలిగింది. కంపెనీకి చెందిన అంతర్జాతీయ లగ్జరీ కార్ల బ్రాండ్‌ జాగ్వార్‌ లాండ్‌రోవర్‌తో (జేఎల్‌ఆర్‌) పాటు దేశీయ మోడళ్లు, వాణిజ్య వాహనాల విక్రయాలు మెరుగైన వృద్ధిని నమోదు చేసుకోవడం ఇందుకు దోహదపడింది. ఈ క్యూ2లో టాటా మోటార్స్‌ మొత్తం ఆదాయం రూ.80,650 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే సమయానికి రూ.62,246 కోట్లుగా ఉంది. జులై-సెప్టెంబర్‌ కాలానికి జేఎల్‌ఆర్‌ కార్ల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 36 శాతం పెరిగి 530 కోట్ల పౌండ్లకు చేరాయి. కంపెనీ వాణిజ్య వాహనాల విక్రయాలు 15 శాతం, ప్రయాణికుల వాహన విక్రయాలు 69 శాతం పుంజుకున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement