Monday, April 29, 2024

Followup: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

సోమవారం భారీగా నష్టపోయిన మార్కెట్లు మంగళవారం అంతే స్థాయిలో లాభపడ్డాయి. మార్కెట్లు ప్రారంభం నుంచే లాభాల్లోకి దూకుపోయాయి. ఇంట్రాడే సమయానికి గరిష్టానికి చేరుకున్నాయి. ఏ దశలోనూ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కనిపించలేదు. సూచీలు గరిష్ట లాభాలు అందుకున్నాయి. ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద 5.65 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈలో నమోదైన సంస్థలు, కంపెనీల మార్కెట్‌ విలువ 280.21 లక్షల కోట్లకు చేరింది. మంగళవారం నాడు అన్ని రంగాల షేర్లు రాణించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ సంస్థల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. చమురు ధరలు కూడా తగ్గడంతో మార్కెట్లకు కలిసి వచ్చింది. చమురు బ్యారెల్‌ ధర 104 డాలర్లుగా ఉంది.

సెన్సెక్స్‌ 1564.45 పాయింట్లు లాభపడి 59537.07 వద్ద ముగిసింది. నిఫ్టీ 446.40 పాయింట్లు లాభపడి 17759.30 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 354 రూపాయలు తగ్గి 50896 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 473 రూపాయలు తగ్గి 53855 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మాకరపు విలువ 79.80 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు..

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు
ఐడీబీఐ బ్యాంక్‌, రాష్ట్రీయ కెమికల్స్‌, జోమాటో షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement