Tuesday, May 21, 2024

Follow up : లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నాడు లాభాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌, ఐరోపా, అమెరికా మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయంగా దిగ్గజ కంపెనీల షేర్లు రాణించడంతో సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. మధ్యాహ్నం తరువాత మార్కెట్లు అమ్మకాల ఒత్తిడితో స్వల్ప నష్టాల్లోకి జారుకున్నప్పటికీ, తిరిగి కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుని చివరకు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 203.01 పాయింట్ల లాభంతో 59959.85 వద్ద ముగిసింది. నిఫ్టీ 49.85 పాయింట్ల లాభంతో 17786.80 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 517 రూపాయలు తగ్గి 50220 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 1083 రూపాయలు తగ్గి 57195 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.18 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు

మారుతీ సుజుకీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎన్‌టీపీసీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, నెస్లే ఇండియా, హోరీ మోటోకార్ప్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడ్డాయి.

- Advertisement -

నష్టపోయిన షేర్లు

టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, సన్‌ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement