Wednesday, May 22, 2024

లాభాల్లో ముగిసిన మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు రోజులో కొంత మేర ఊగిసలాట ధోరణి కనబరచాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 52,101 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. కానీ, ఒంటిగంట తర్వాత లోహ, స్థిరాస్తి, ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగ షేర్లు పుంజుకోవడంతో సూచీలు ఇంట్రాడే గరిష్ఠాలను తాకాయి. నిఫ్టీ సైతం ఇదే ట్రెండ్‌ను కొనసాగించింది. ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెన్స్‌ 193 పాయింట్లు లాభపడి 53,054 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 61 పాయింట్లు ఎగబాకి 15,879 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.60 వద్ద నిలిచింది. ిిిిిిిిిి

ఇది కూడా చదవండి: దేశంలో మరోసారి పెరిగిన పెట్రో ధరలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement