Thursday, May 2, 2024

పెద్దగా పెరగని ఐటీ ఉద్యోగుల వేతనాలు.. 10 ఏండ్లలో 45 శాతమే పెరుగుదల

మన దేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందినంత వేగంగా కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకుంటున్న వారి వేతనాలు పెరగడంలేదు. ఐటీ కంపెనీల ఆదాయాలు, లాభాలు ఎన్నో రెట్లు పెరిగినప్పటికీ, అదే స్థాయిలో కొత్తగా ఉద్యోగంలోకి తీసుకున్న కొత్తవారికి ఇచ్చే వేతనాలు మాత్రం చాలా నెమ్మదిగా పెరుగుతున్నాయని ఒక నివేదిక తెలిపింది. పది సంవత్సరాల క్రితం ఒక ప్రముఖ ఐటీ కంపెనీ కొత్త వారికి 2.4 లక్షల వార్షిక వేతనంలో ప్యాకేజీ ఇస్తే, ఇప్పుడు అదే కంపెనీ కొత్తగా ఉద్యోగంలోకి తీసుకుంటున్న వారికి 3.36 లక్షల ప్యాకేజీని ఆఫర్‌ చేస్తోంది. అంటే ఈ పది సంవత్సరాల్లో వేతనంలో పెరుగుదల కేవలం 40 శాతం మాత్రమే. అదే సమయంలో ఆయా కంపెనీ ఆదాయాలు, లాభాలు మాత్రం ఇంతకు ఎన్నో రెట్లు అధికంగా ఉంటున్నాయని తెలిపింది.
ఇండియన్‌ ఐటీ కంపెనీలు ఎప్పుడో పాత కాలం నాటి ప్యాకేజీలను కొత్తవారికి ఇస్తున్నాయని ఇన్ఫోసిస్‌ మాజీ డైరెక్టర్‌ మోహన్‌దాస్‌ పాయి అభిప్రాపడ్డారు. ఐటీ కంపెనీలు కొత్త ఉద్యోగులను దోపిడీ చేస్తున్నాయని ఆయన చెప్పారు.

కొత్త వారికి ఐటీ కంపెనీలు 3.5 నుంచి 3.8 లక్షల ప్యాకేజీ మాత్రమే ఇస్తున్నాయని, వాస్తవానికి ఇది 2008-09 సంవత్సరం నాటి ప్యాకేజీలని చెప్పారు. ఐటీ కంపెనీల్లోకి ఉద్యోగాల్లోకి తీసుకుంటున్న కొత్తవారికి ఐటీ కంపెనీలు 5 వేల డాలర్ల కంటే తక్కువ ప్యాకేజీనే ఆఫర్‌ చేస్తున్నాయని ఎక్స్‌ఫోనో సంస్థ వర్క్‌ఫోర్స్‌ హెడ్‌ ప్రసాద తెలిపారు. రూపాయ విలువ తగ్గడంతో ఐటీ కంపెనీల ఆదాయం 13 నుంచి 14 శాతం పెరిగాయి. ఉన్నతాధికారులకు మాత్రమే ఎక్కువ వేతనాలు ఇస్తున్నారు. జూనియర్లు ఎందుకు ఇవ్వడంలేదని మోహన్‌దాస్‌ పాయి ప్రశ్నించారు. కొత్తవారికి ఇస్తున్న వేతనాలు వాస్తవానికి వారి అవసరాలకు సరిపోవడంలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement