Monday, April 29, 2024

నిబంధనలు బేఖాతరు.. ప్లాస్టిక్ నిషేధం పట్టని వ్యాపారులు, పట్టించుకోని అధికారులు

(ప్రభన్యూస్‌): ప్రజలు ఆరోగ్యాలను దెబ్బతీయడం.. భూతాపం పెరగడంతోపాటు పలు విపత్తులకు కారణమయ్యే న్యాణత లేని పాలిథిన్ (ప్లాస్టిక్‌) ఉత్పత్తులపై ప్రభుత్వం విధించిన నిషేదం మూణ్ణళ్ల ముచ్చటగా మారింది. దానికితోడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పట్టణ, పల్లె ప్రగతిలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ ఉత్పత్తుల విక్రయాలను నిలిపి వేయాలని కోరుతూ.. స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పించారు. అంతేకాకుండా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నుంచి తీర్మానం చేసి నిషేధించిన ప్లాస్టిక్‌ ఉత్పత్తులను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు నోటిసులు సైతం జారీ చేశారు. వ్యాపారులపై అధికారుల నిఘా కొరవడటంతో కొందరు వ్యాపారులు తిరిగి నాణ్యతలేని ప్లాస్టిక్‌ ఉత్పత్తులను యథేచ్చగా విక్రయిస్తున్నారు.

విచ్చలవిడిగా విక్రయాలు..

మొయినాబాద్‌ మండలంలోని అన్ని పంచాయతీలు, అనుబంధ గ్రామాలు సైతం నాణ్యత లేని పాలి థిన్‌ కవర్లు, ఇతర ఉత్పత్తుల విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు మొదలుకొని హోటళ్లు, అల్పాహార, కిరణ , కూరగాయాలు, పండ్లు, ఇతర చిరు దుకాణాల్లో వీటి వాడకం రోజురోజుకు పెరిగిపోతుంది. 40 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న పాలిథిన్‌ సంచులను తయారు చేయడం, ఉపయోగించడాన్ని గతంలో ప్రభుత్వం నిషేధిం చింది. అయినప్పటికీ మండలంలో పాలిథిన్‌ సం చుల నాణ్యతను గుర్తించే యంత్రాలు లేకపోవ డం, సంబంధిత శాఖ అధికారుల అలసత్వం కారణంగా 40 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న పాలిథిన్‌ సంచులనే వ్యాపారులు వాడుతున్నారు. మండలంలో రోజుకు సగటు60 నుంచి 80 కిలోల వరకు పాలిథిన్‌ సంచులు విక్రయం సాగుతుంది. గ్రామాల్లోని పలు కాలనీల్లో వాడిపాడేస్తున్న పాలిథిన్‌ సంచులను కొందరు ఇళ్ల సమీపంలోనే కాల్చుతున్నారు. దీంతో సమీపంలోని ఇళ్లలోకి విషపూరితమైన పొగ, వ్యాపి స్తూ ప్రజల రోగాలు బారిన పడుతున్నారు.

ప్లాస్టిక్‌ అనర్థాలు…

పాలిథిన్‌ సంచులు ఏళ్ల తరబడి భూమిలో కరిగిపోకుండా ఉండడంతో విపరీ తమైన భూతాపం పెరుగుతుంది. వర్షాకాలంలో కాల్వాల్లో వరద ప్రవాహాన్ని అడ్డుకుని సమస్య లను సృష్టిస్తాయి. నాణ్యతగా లేని పాలిథిన్‌ గ్లా సులు, ఇతర ఉత్పత్తుల్లో టీ, వేడీ ఆహార పదార్థా లను తినడం వల్ల పలు రకాల వ్యాధుల బారినపడే అవకాశం ఉంటుందని వైద్యులు హె చ్చరి స్తున్నారు. వీటిని జనావాసాల మధ్యన కుప్పగా పడేసి కాల్చడంతో విషపూరితమైన పొగ కారణం గా శ్వాత కోస వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement