Monday, September 25, 2023

మార్కెట్‌లోకి రియలన్స్‌ ఎయిర్‌ ఫైబర్‌… 599తో ప్లాన్స్‌ ప్రారంభం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జనరల్‌ బాడీ సమావేవంలో ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ప్రకటించిన జియో ఎయిర్‌ ఫైబర్‌ మార్కెట్‌లోకి వచ్చింది. ఎయిర్‌ ఫైబర్‌ను వినాయక చవితి సంవదర్భంగా మార్కెట్‌లోకి తీసుకు వస్తామని ఆగస్టు 28న జరిగిని రిలయన్స్‌ 46వ వార్షిక సమావేశంలో ముఖేష్‌ అంబానీ ప్రకటించారు. జియో ఎయిర్‌ ఫైబర్‌ పట్ల టెక్‌ వర్గాల్లో అప్పటి నుంచే ఆసక్తి నెలకొంది.

- Advertisement -
   

జియో ఎయిర్‌ ఫైబర్‌…

జియో ఎయిర్‌ ఫైబర్‌ 5జీ ఆధారిత వైర్‌లెస్‌ వైఫై సర్వీస్‌. అత్యంత వేగంతో ఇంటర్‌నెట్‌ను అందించేందుకు జియో దీన్ని తీసుకు వచ్చింది. ఇళ్లు, కార్యాయాలకు దీని ద్వారా సర్వీస్‌ అందించవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌ వైర్‌ ఆధారిత ఇంటర్‌నెట్‌ సర్వీస్‌లు ఉన్నాయి. రిలయన్స్‌ జియో ఫైబర్‌ కూడా వైర్‌ ఆధారిత ఇంటర్‌నెట్‌ సేవలు అందిస్తోంది. జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌లను అందిస్తోంది.

ఫైబర్‌ ఆప్టికల్‌ కేబుల్స్‌ ద్వారా ఇంటర్‌సేవలను అందిస్తుంది. జియో ఎయిర్‌ ఫైబర్‌ సేవలు అందించేందుకు ఎలాంటి వైర్లు, కేబుల్స్‌ అవసరంలేదు. జియో ఎయిర్‌ ఫైబర్‌ డివైజ్‌ ద్వారా వైఫై సేవలు అందిస్తుంది. ఈ డివైజ్‌ను ఆన్‌ చేయగానే దగ్గరలోని టవర్‌ నుంచి 5జీ రేడియో లింక్‌ ద్వారా సిగ్నల్స్‌ అందుకుని ఇంటర్నెట్‌ అందిస్తుంది. ఇది బ్రాడ్‌బ్యాండ్‌ కంటే వేగంగా నెట్‌ సేవలను అందిస్తుంది. ఇంట్లో ఉన్న ఎన్ని డివైజ్‌లకైనా దీనితో కనెక్ట్‌ చేసుకోవచ్చు.

599తో ప్లాన్లు ప్రారంభం…

జియోఎయిర్‌ ఫైబర్‌ ప్లాన్లు 599 రూపాయలతో ప్రారంభం అవుతాయి. ఓటీటీలు లేకుండా ఈ ప్లాన్‌ 399తో లభిస్తుంది. ఈ ప్లాన్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను వినియోగదారులు పొందుతారు. నెలకు 599 ప్లాన్‌తో 30 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్‌నెట్‌ వస్తుంది. దీనితో పాటు డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా, సన్‌నెక్ట్స్‌ వంటి ఓటీటీలు లభిస్తాయి. 899 ప్లాన్‌తో 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్‌నెట్‌ అభిస్తుంది.

దీనితో పాటు ఓటీటీలు వస్తాయి. 1199 రూపాయల ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్‌ నెట్‌తో పాటు, పైన తెలిపిన ఓటీటీలకు అదనంగా నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలు లభిస్తాయి. జియో ఎయిర్‌ ఫైబర్‌ మ్యాక్స్‌ ప్లాన్స్‌లో 1499రూపాయలు నుంచి ప్రారంభమవుతాయి. ఈ ప్లాన్‌లో 300 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్‌నెట్‌ లభిస్తుంది. దీనితో పాటు ఓటీటీలు లభిస్తాయి. 2499 రూపాయల ప్లాన్‌తో 500 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్‌నెట్‌ లభించడంతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ లభిస్తాయి.

3999 రూపాయల ప్లాన్‌లో 1జీబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్‌నెట్‌ లభిస్తుంది. దీనితో పాటు ఓటీటీలు ఉంటాయి. ఈ ప్లాన్లు అన్ని ఆరు నెలలు, 12 నెలల కాలవ్యవధిలో లభిస్తాయి. ఈ ప్లాన్‌లో ఉన్న రేట్లకు జీఎస్టీ అదనంగా వసూలు చేస్తారు. ఇన్‌స్టలేషన్‌ ఛార్జీల కింద 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

8 నగరాల్లో ప్రారంభం…

ప్రస్తుతం జియో ఎయిర్‌ ఫైబర్‌ సేవలను దేశంలో 8 నగరాల్లో ప్రారంభిస్తున్నార. క్రమంగా దేశంలోని ప్రతి ప్రాంతాన్ని కవర్‌ చేస్తామని కంపెనీ తెలపింది. ప్రస్తుతం హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూర్‌, చెన్నయ్‌, న్యూఢిల్లి, కోల్‌కతా, ముంబై, పుణే నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్‌ సర్వీస్‌లు అందుబాటులోకి వస్తాయి. జియో ఎయిర్‌ ఫైబర్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. 1జీబీపీఎస్‌ వేగంతో ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ, వైఫై 6 సపోర్ట్‌ సహా 16కుపైగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లను జియో అందిస్తోంది. వీటితో పాటు 550కిపైగా టీవీ ఛానెళ్లను అందించనుంది.

ఇందులో సెక్యూరిటీ ఫైర్‌వాల్‌ కూడా ఉంది. ఎయిర్‌ ఫైబర్‌ యాప్‌ ద్వారా యూజర్లు దీన్ని నియంత్రించవచ్చు. జియోకు ముందు ఇదే తరహా సర్వీస్‌లను ఎయిర్‌టెల్‌ ప్రారంభించింది. దీంతో పోల్చుకుంటే జియో ఎయిర్‌ఫైబర్‌ ఎక్కువ ఫీచర్లు కలిగి ఉంది. టీవీ ఛానెల్స్‌ పరంగా, ఓటీటీ పరంగా ఎక్కువ సంఖ్యలో అందిస్తోంది. జియో ఎయిర్‌ఫైబర్‌ డివైజ్‌ ద్వారా దేశంలోని ప్రతి మూలకు నెట్‌సర్వీస్‌లు అందిస్తామని సంస్థ తెలిపింది.

రానున్న మూడు సంవత్సరాల్లో 20 కోట్లకు పైగా కస్టమర్లను సాధించాలని నిర్ణయించింది. తమ ఫైబర్‌ టూ హోం సర్వీస్‌ జియో ఫైబర్‌ కోటి మందికిపైగా కస్టమర్లకు సేవలు అందిస్తోందని జియో ఇన్ఫోకామ్‌ ఛైర్మన్‌ ఆశాష్‌ అంబానీ తెలిపారు. జియో ఎయిర్‌ఫైబర్‌తో దేశంలోని లక్షలాది గృహాలకు, చిన్న వ్యాపారులకు చేరువ అయ్యేందుకు తీసుకు వచ్చినట్లు తెలిపారు. జియో ఎయిర్‌ఫైబర్‌తో విద్య, వైద్యం, పర్యవేక్షణ స్ట్మార్ట్‌ హోం పరిష్కారాల కోసం నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందిస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement