Sunday, May 19, 2024

Sales | జనవరిలో రికార్డు స్థాయిలో ప్రయాణికుల వాహన విక్రయాలు..

ప్రయాణికుల వాహన విక్రయాలు జనవరిలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2023 జవవరితో పోల్చేకుంటే 2024 జనవరిలో వీటి అమ్మకాలు 13 శాతం పెరిగాయని వాహన డీలర్ల సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) ఫాడా తెలిపింది. జనవరిలో టూ వీలర్స్‌ అమ్మకాలు 15 శాతం, త్రీ వీలర్స్‌ అమ్మకాలు 37 శాతం, ట్రాక్టర్ల అమ్మకాలు 21 శాతం పెరిగాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు మాత్రం కేవలం 0.1 శాతం మాత్రమే అమ్మకాలు పెరిగాయి.

ఎస్‌యూవీలకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని ఫాడా తెలిపింది. గత సంవత్సరం జనవరిలో 3,47,086 యూనిట్ల ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు జరిగితే, ఈ సారి 13 శాతం పెరిగి 3,93,250 యూనిట్లకు అమ్మకాలు పెరిగాయి. భారీగా కొత్త మోడళ్లు మార్కెట్‌లోకి రావడం, వివిధ రకాల స్కీమ్స్‌, పెళ్లిళ్ల సీజన్‌ వంటి కారణాల మూలంగా జనవరిలో ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు పెరిగాయని ఫాడా తెలిపింది. జనవరిలో విక్రయాలు జరిపిన చాలా కార్ల కోసం 50-55 రోజుల వరకు వేచి చూడాల్సి ఉంటుందన్నారు.

జనవరిలో ద్విచక్ర వాహనాలు వార్షిక ప్రాతిపదికన 15 శాతం పెరిగాయి. ఈ వాహనాలు 14,58,849 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 89,208 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహనాల విక్రయాలు 37 శాతం పరిగి 97,675 యూనిట్లుగా ఉన్నాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 21 శాతం పెరిగి 88,671 యూనిట్లుగా ఉన్నాయి. మొత్తంగా జనవరిలో వాహన రిటైల్‌ అమ్మకాలు 21,27,653 యూనిట్లుగా నమోదైనట్లు ఫాడా తెలిపింది. 2023 జనవరిలో విక్రయమైన 18,49,691 యూనిట్లతో పోల్చితే ఈ సారి 15 శాతం వృద్ధి నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement