Sunday, April 28, 2024

చిన్న మొత్తాల పొదుపు స్కీమ్‌లకు పాన్‌, ఆధార్‌ సమర్పించడం తప్పనిసరి

న్యూఢిల్లిd : అన్ని రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలకు పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డును ఈ నెల 30లోగా సమర్పించాల్సి ఉంటుంది. లేకుంటే ఆయా ఖాతాలను నిలిపివేయనున్నారు. చిన్న మొత్తాల్లో పొదుపు చేస్తున్న వారు ఈ వివరాలు సమర్పించకుంటే వారి ఖాతాలను స్తంభింపచేస్తారు. వీటిని సమర్పించే వరకు ఈ ఖాతాలను నిర్వహించడం కుదరదు.

ఇప్పటికే పాన్‌, ఆధార్‌ కార్డు ఇచ్చిన వారు మరోసారి ఇవ్వాల్సిన అవసరంలేదు. 2023 ఏప్రిల్‌ 1 నుంచి చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెడుతున్న వారికి ప్రభుత్వం పాన్‌, ఆధార్‌ కార్డు తప్పనిసరి చేసింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌ తరువాత ఈ ఖాతాలు తీసుకున్న వారు మళ్లిd వీటిని సమర్పించాల్సిన అవసరంలేదు.పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎస్‌సీ), సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌) సహా పలు ఇతర పథకాలు, చిన్న మొత్తాల పొదుపు పథకాలు కిందకు వస్తాయి.

ప్రధానంగా సీనియర్‌ సిటిజన్ల్లు, నష్టాన్ని ఎక్కువ భరించలేమని భావించే వారు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. ఈ పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. తక్కువ వేతనాలు వచ్చే ఉద్యోగుల్లో ఈ పథకాలకు మంచి ఆదరణ ఉంది. 2023 జులై నుంచి సెప్టెంబర్‌ కాలానికి కొన్ని పథకాలపై ప్రభుత్వం వడ్డీ రేటును 10 నుంచి 35 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఎస్‌సీఎస్‌ఎస్‌, పీపీఎఫ్‌, కిసాన్‌ వికాస్‌ పత్ర, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలపై వడ్డీరేట్లను పెెంచలేదు. పీపీఎఫ్‌పై వడ్డీరేటును 2020 ఏప్రిల్‌ నుంచి 7.1 శాతంగా కొనసాగిస్తోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement