Wednesday, May 8, 2024

భారీగా పెరిగిన రష్యా చమురు దిగుమతులు

ఆర్కిటిక్‌ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ముడిచమురుకు ఇప్పుడు ఆసియా దేశాలు ప్రధాన మార్కెట్‌గా మారాయి. యూరప్‌ దేశాలు విధించిన ఆంక్షల నేపథ్యంలో, రష్యా ఇక్కడి చమురును భారత్‌, చైనాలకు పంపుతోంది. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత ఈ సరఫరాలు గణనీయంగా పెరిగాయి. ఆర్కిటిక్‌ గ్రేడ్‌లు, ఆర్కో, ఆర్కో/నోవీపోర్ట్‌, వరండేలు సాధారణంగా తూర్పు దేశాలకు వెళ్లవు.

కానీ యూరోపియన్‌ యూనియన్‌, జి7 దేశాలు, ఆస్ట్రేలియా డిసెంబర్‌లో రష్యన్‌ చమురు ధరలపై సీలింగ్‌ విధించడంతో తన ముడిచమురు ఉత్పత్తులకు కొత్త మార్కెట్లను రష్యా అన్వేషిస్తోందని సింగపూర్‌కు చెందిన ఓ వ్యాపారి చెప్పారు. నవంబర్‌లో రికార్డు స్థాయిలో 6.67 మిలియన్‌ బ్యారల్స్‌, డిసెంబర్‌లో 4.1 మిలియన్‌ బ్యారల్స్‌ చమురు ఆర్కిటిక్‌ నుంచి భారత్‌కు చేరాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement