Friday, April 26, 2024

కీలక రంగాల్లో పెరిగిన వృద్ధిరేటు

దేశంలో ఏనిమిది కీలకమైన మౌలిక రంగాల వృద్ధిరేటు 12.7 శాతంగా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఎనిమిది మౌలిక సదుపాయల రంగాలు గణనీయమైన ప్రగతి సాధించాయి. ఈ వివరాలను పరిశ్రమల శాఖ ఈ రోజు (శుక్రవారం) విడుదల చేసింది. జూన్‌తో ముగిసిన ఈ త్రైమాసికంలో కీలక రంగాల వృద్ధిరేటు 12.7 శాతంగా ఉందని ఈ నివేదికలో పేర్కొన్నారు. గత సంవత్సరం ఇదే కాలంలో ఈ రంగాల వృద్ధిరేటు 4.1 శాతం. దీంతో పోల్చితే కీలక రంగాల వృద్ధిరేటు డబుల్‌ డిజిట్‌ను దాటింది.

జూన్‌ నెలలో ఈ రంగాలు 8 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ప్రధానంగా బొగ్గు, సిమెంట్‌, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్‌ . స్టీల్‌, సహాజ వాయువు రంగాల్లో డిమాండ్‌ అధికంగా ఉంది. 2021, జూన్‌లో కీలక రంగాల వృద్ధిరేటు 9.4 శాతం ఉంది. విద్యుత్‌ డిమాండ్‌ పెరగడంతో బొగ్గు ఉత్పత్తి పెరిగిందని విశ్లేషకులు తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement