Thursday, May 2, 2024

ఆపిల్​ ఐఫోన్లపై భారీ ఆఫర్లు.. తక్కువ ధరలోనే ఐఫోన్​ 12

ఆపిల్ ఐఫోన్ వాడాలి అని క‌ల‌లు క‌నే వారికి గుడ్ న్యూస్.. చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఆపిల్ ఐఫోన్‌ను ఉపయోగించాలని కలలు కంటారు. అయితే ఖరీదైన ధర కారణంగా చాలా తక్కువ మంది మాత్రమే ఐఫోన్‌ను కొనుగోలు చేయగలుగుతారు. కాగా, ఆపిల్ ఇటీవలే ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసింది.. దీని ధర దేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం అవుతుంది. దీంతో పాత ఐఫోన్ సిరీస్‌పై భారీ ఆఫర్లు అందించారు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఈ నెల (అక్టోబర్) 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ లో కేవలం రూ.32,999తో ఐఫోన్ 12ని సొంతం చేసుకోవచ్చు. బిగ్ బిలియన్ డేస్ సేల్ కింద ఐఫోన్ 12 రూ.38,999కి విక్రయించనున్నారు. ఇది కాకుండా మొబైల్ ఫోన్‌పై రూ.3,000 బ్యాంక్ ఆఫర్, రూ.3,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. వీటితో ఫోన్ 12 ధర రూ.32,999కు తగ్గుతుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.48,999కి అందుబాటులో ఉంది.

ఐఫోన్ 12 ఫీచ‌ర్స్..

ఐఫోన్ 12లో 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే అందించారు. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో వెనకవైపు రెండు 12 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు 12 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. యాపిల్ ఏ14 చిప్‌సెట్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ ఫోటోగ్రఫీ, బ్యాటరీ పరంగా మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.

- Advertisement -

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్స్..

ఇక‌, గత నెలలో లాంచ్ అయిన‌ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్లు రెండిలోనూ ఏ16 బయోనిక్ చిప్, డైనమిక్ ఐల్యాండ్, 48 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఈ ఫీచర్లు ఉన్నాయి. గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో ఈ ఫీచర్లు మొదటగా అందించారు. ఇక‌ ఇప్పుడు స్టాండర్ట్ వేరియంట్స్‌లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిలో యూఎస్‌బీ టైప్-సీ పోర్టును కూడా అందించారు. ఐఫోన్ 15 ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఐఫోన్ 15 ప్లస్ ధరను మనదేశంలో రూ.89,900గా నిర్ణయించారు. వీటికి సంబంధించిన సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది.

ఫ్లిప్‌కార్ట్‌ డీల్స్..

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌తో పాటు శాంసంగ్, రియల్‌మీ, మోటొరోలా, వివో స్మార్ట్‌ఫోన్‌లపై కూడా డిస్కౌంట్లు అందించనున్నారు. పోకో ఎం5ని రూ. 6,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. అదే విధంగా వివో వీ29ఈని రూ.24,999కి, నథింగ్ ఫోన్ 1ని రూ.23,999కి ఆర్డర్ చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement