Sunday, April 28, 2024

హెర్బాలైఫ్‌ న్యూట్రిషన్‌ ఈట్‌ రైట్‌ ఫుడ్‌ సమ్మిట్‌.. ఆరోగ్యవంతమైన భవిష్యత్‌ లక్ష్యం

ప్రీమియర్‌ గ్లోబల్‌ న్యూట్రిషన్‌ కంపెనీ హెర్బాలైఫ్‌ న్యూట్రిషన్‌, ఢిల్లిdలో ఈట్‌ రైట్‌ ఫుడ్‌ సమ్మిట్‌ 2022ను నిర్వహించింది. ఈ వ్యూహాత్మక ఫోరమ్‌ ప్రభుత, రాజకీయ, ప్రైవేటు రంగంలోని వాటాదారులను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు ఈట్‌ రైట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆరోగ్యవంతమైన భవిష్యత్ను తగిన ఎజెండాను తీర్చిదిద్దనుంది. హెర్బాలైఫ్‌ న్యూట్రిషన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ ఇండియా కంట్రీ హెడ్‌ అజయ్‌ ఖన్నా మాట్లాడుతూ.. ఓ కంపెనీగా.. మా ప్రచారం ఈట్‌రైట్‌కు అనుగుణంగా పని చేయడంతో సంతోషంగా ఉన్నాం. ఇది భారత ప్రభుత జాతీయ ఆరోగ్య విధానం 2017కు లోబడి ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవనశైలి, న్యూట్రిషన్‌ను మేము విశ్వసిస్తున్నాం.

భారతదేశాన్ని ఆరోగ్యవంతంగా మలచాలనే మా లక్ష్యం దిశగా అతి కీలకమైన ముందుడుగు ఇది అన్నారు. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ ్స అథారిటీ ఆఫ్‌ ఇండియా సీఈఓ అరుణ్‌ సింఘాల్‌ మాట్లాడుతూ.. గత కొద్ది సంవత్సరాలుగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ భారతీయులందరికీ సురక్షితమైన, సంపూర్ణమైన ఆహారం లభించేలా తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈట్‌రైట్‌ ఇండియాను జాతీయ ఉద్యమంగా గుర్తించారు. ఇది దేశపు ఆహార వ్యవస్థను సమూలంగా మార్చడంతో పాటు సురక్షిత, ఆరోగ్య, సస్టెయినబల్‌ డైట్స్‌ను ప్రతీ ఒక్కరికీ అన్ని సమయాల్లోనూ అందిస్తుంది. ఆరోగ్యవంతమైన రేపటి కోసం వినూత్నమైన పరిష్కారాలను సైతం ఇది తీసుకువస్తుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement