Sunday, May 19, 2024

Oil Imports | నవంబర్‌లో భారీగా రష్యా చమురు.. 4 నెలల గరిష్టానికి దిగుమతులు

రష్యా నుంచి మన దేశం నవంబర్‌లో రికార్డు స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంది. దిగుమతులు 4 నెలల గరిష్టానికి చేరి రోజు 1.6 మిలియన్‌ బ్యారెళ్ల చమురును మన దేశం దిగుమతి చేసుకుంది. అక్టోబర్‌ నెలతో పోలిస్తే నవంబర్‌లో దిగుమతులు 3.1 శాతం ఎక్కువ. మొత్తం దేశ దిగుమతుల్లో రష్యా వాటా 36 శాతంగా ఉంది. భారత్‌కు చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో రష్యా ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన నాటి నుంచి మన దేశం డిస్కౌంట్‌ రేటులో భారీగా చమురు కొనుగోలు చేస్తోంది.

ప్రపంచంలోనే మన దేశం చమురు దిగుమతుల్లో, వినియోగంలో మూడో స్థానంలో ఉంది. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేయడంతో అమెరికా, దాని మిత్ర పక్షాలు ఆంక్షలు విధించాయి. అప్పటి నుంచి మన దేశం రష్యా నుంచే అధికంగా చమురును దిగుమతి చేసుకుంటోంది. అంతుకు మందు భారత్‌ ఎక్కువగా తన అవసరాల కోసం మిడిల్‌ ఈస్ట్‌ దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకునేది. రష్యా నుంచి తక్కువ మోతాదులోనే భారత్‌ చమురు కొనుగోలు చేసేది. రష్యా నుంచి చమురు దిగుమతుల్లో ట్రాన్స్‌పోర్టు ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

అక్టోబర్‌లో మన దేశం మొత్తంగా ప్రతి రోజు 4.5 మిలియన్‌ బేరళ్ల చమురును దిగుమతి చేసుకుంది. అక్టోబర్‌ చేసుకున్న మొత్తం దిగుమతులతో పోల్చితే ఇది 4.5 శాతం తక్కువ. గత సంవత్సరం అక్టోబర్‌ నెలతో పోల్చితే 13 శాతం ఎక్కువ. నవంబర్‌ నెలలో రష్యా తరువాత మన దేశానికి ఇరాక్‌, సౌదీ అరేబియా దేశాల నుంచి ఎక్కువ దిగుమతి వచ్చాయి. మన దేశం మొత్తం దిగుమతి చేసుకున్న చమురులో మిడిల్‌ ఈస్ట్‌ దేశాల వాటా 46 శాతంగా ఉంది. అక్టోబర్‌ నెలలో ఇది 48 శాతంగా ఉంది. కామన్వెల్త్‌ దేశాలైన రష్యా, ఖజకిస్తాన్‌, అజర్‌బైజాన్‌ దేశాల నుంచి దిగుమతి అయిన చమురు వాటా 39 శాతంగా ఉంది. అక్టోబర్‌లో ఇది 36 శాతంగా ఉంది.

- Advertisement -

ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్‌ 1 నుంచి 8 నెలల కాలంలో రష్యా నుంచి చేసుకుంటున్న చమురు దిగుమతులు 77 శాతానికి చేరుకున్నాయి. సగటున రోజుకు రష్యా నుంచి 1.7 మిలి¸న్‌ బేరళ్ల చమురు దిగుమతి చేసుకున్నాం. రష్యా నుంచి చమురు దిగుమతులు పెరగడంతో, మన దేశం ఓపెక్‌ చేశాల నుంచి చేసుకుంటున్న దిగుమతులు కూడా ఏప్రిల్‌-నవంబర్‌ కాలంలో 62 శాతం నుంచి 48 శాతానికి తగ్గాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement