Monday, April 29, 2024

హెచ్‌సీఎల్‌ నికరలాభం 19శాతం అప్‌.. ఈక్విటీ షేరుపై రూ. 10 మధ్యంతర డివిడెండ్‌

ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ డిసెంబర్‌ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికరలాభం 19శాతం పెరిగి రూ.4096 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ.3,442 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం రూ.22,331 కోట్ల నుంచి రూ.26,700 కోట్లకు చేరింది. 19.5 శాతం వృద్ధిని కనబరిచింది. అయితే, సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన, పన్ను తర్వాత లాభం మునుపటి సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.3,489 కోట్ల నుంచి 17శాతం మేరకు పెరిగింది. 6000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది.

అట్రిషన్‌ రేటు 21.7 శాతం వద్ద ఉన్నది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇది 23.8 శాతం వద్ద ఉండేది. 2022 త్రైమాసికం నుంచి 2023 త్రైమాసికం మధ్య 5892 మంది ఫ్రెషర్స్‌ను నియమించినట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,22,270గా ఉంది. కాగా, ఈ సంస్థ ప్రతి షేరుకు రూ.10 చొప్పున మధ్యంతర డివిడెంట్‌ ప్రకటించింది. హెచ్‌సీఎల్‌ టెక్‌ నాల్గవ మధ్యంతర డివిడెండ్‌ రికార్డు తేదీని 2023 జనవరి 20గా నిర్ణయించింది. ఈ డివిడెండ్‌ చెల్లింపు ఫిబ్రవరి 1న జమ చేయబడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement