Thursday, May 2, 2024

డిజిటల్‌ చెల్లింపులు వృద్ధి , బై నౌ.. పే లేటర్‌కు పెరిగిన ఆదరణ..

న్యూఢిల్లి : ప్రపంచ వ్యాప్తంగా సాంకేతీకరణ పెరుగుతుండటంతో.. లావాదేవీల విషయంలో కూడా డిజిటల్‌ చెల్లింపులు వృద్ధి చెందుతున్నాయి. 2023 నాటికి డిజిటల్‌ వాలెట్‌లు నగదును అధిగమిస్తాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ-కామర్స్‌ చెల్లింపులు క్రెడిట్‌ కార్డుల నుంచి డిజిటల్‌ వాలెట్‌లవైపు పరుగులు పెడుతున్నాయి. బై నౌ.. పే లేటర్‌ (బీఎన్‌పీఎల్‌)కు ఆదరణ పెరుగుతున్నది. తరువాతి చెల్లింపులు కూడా ఆన్‌లైన్‌ వేదికగానే పూర్తవుతున్నాయి. ఎఫ్‌ఐఎస్‌.. వరల్డ్‌ పే 2022 గ్లోబల్‌ పేమెంట్స్‌ రిపోర్టు (జీపీఆర్‌) ప్రకారం.. భారతదేశ ఈ-కామర్స్‌ మార్కెట్‌ 2015 నుంచి 2021 మధ్య 96 శాతం పెరిగి.. 120 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. జీపీఆర్‌ ప్రస్తుత, భవిష్యత్తు చెల్లింపుల ట్రెండ్‌లను, చెల్లింపు పద్ధతిని పరిశీలిస్తున్నది. భారతదేశంలో సాంకేతికత, డిజిటలైజేషన్‌లో పురోగతి సాధిస్తున్నది. నగదు రహిత చెల్లింపులు పెరుగుతున్నాయి. ప్రీపెయిడ్‌ కార్డులు, బ్యాంక్‌ బదిలీలు, క్యాష్‌ ఆన్‌ డెలివరీ మార్కెట్‌ వాటాలు క్షీణించాయనే చెప్పుకోవాలి. జీపీఆర్‌ నివేదిక ప్రకారం.. 2025 నాటికి ఈ-కామర్స్‌ లావాదేవీ విలువలో సమిష్టిగా కేవలం 8.8 శాతం మాత్రమే ఉంటుందని అంచనా వేయబడింది.

క్రెడిట్‌ కార్డుల వాటా 13 శాతం..

2021లో ప్రముఖ ఈ-కామర్స్‌లో చెల్లింపుల సరళిని పరిశీలిస్తే.. డిజిటల్‌ వాలెట్లు (45.40 శాతం) తరువాత.. డెబిట్‌ కార్డుల ద్వారా 14.60 శాతం చెల్లింపులు జరుగుతున్నాయి. అలాగే క్రెడిట్‌/ఛార్జ్‌ కార్డుల ద్వారా.. 13.30 శాతం చెల్లింపులు జరిగాయని నివేదిక ద్వారా స్పష్టం అవుతున్నది. డిజిటల్‌ వ్యాలెట్ల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో పెరుగుతున్నాయి. భారతదేశంలో డిజిటల్‌ వ్యాలెట్లు మరింత పెరుగుతున్నాయని తెలిపింది. 52.90 శాతం అంచనా వేసినప్పటికీ.. 2025 నాటికి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అధ్యయనాల ద్వారా తెలిసింది. భారతదేశంలో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) మార్కెట్‌ 2021 నుంచి 2025 మధ్య 28.80 శాతం పెరుగుతుందని అంచనా వేయబడింది. 1.08 ట్రిలియన్‌ డాలర్లను అధిగమిస్తుంది.

పెరుగుతున్న ఆన్‌లైన్‌ లావాదేవీలు..

లావాదేవీ విలువలో 37.1 శాతంతో 2021లో నగదు ప్రధాన స్టోర్‌ చెల్లింపు పద్ధతిగా ఉంది. ఆ తరువాత డిజిటల్‌ వాలెట్‌లు (24.80 శాతం), క్రెడిట్‌/ఛార్జ్‌ కార్డులు (18.10 శాతం)గా ఉన్నాయి. అయినప్పటికీ.. డిజిటల్‌ వాలెట్లు 2023 నాటికి పీఓఎస్‌ లావాదేవీ విలువలో 30.80 శాతంగా అంచనా వేయబడినప్పుడు, నగదును అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టోర్‌ చెల్లింపు పద్ధతిగా మారుస్తాయని అంచనా వేయబడింది. బై నౌ.. పే లేటర్‌ (బీఎన్‌పీఎల్‌) భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్‌ చెల్లింపు పద్ధతిలో ఒకటిగా కొనసాగుతున్నది. వినియోగదారులు పరిమిత వాయిదాల ద్వారా.. వస్తువులు, సేవలకు చెల్లించడానికి అనుమతించే బీఎన్‌పీఎల్‌ సేవలు.. 2021లో కేవలం 3 శాతం ఉంటే.. 2025 నాటికి ఈ-కామర్స్‌ మార్కెట్‌ విలువలో 8.6 శాతానికి పెరుగుతాయని అంచనా వేయబడింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement