Friday, April 26, 2024

రష్యా నుంచి బంగారం దిగుమతులు బంద్‌.. జీ7 దేశాల నిర్ణయం

రష్యా నుంచి కొత్తగా బంగారం దిగుమతులను నిలిపివేయాలని బ్రిటన్‌, అమెరికా, కెనడా నిర్ణయించాయి. రష్యాపై ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేసేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు బ్రిటన్‌ తెలిపింది. జర్మనీలో సమావేశమైన జీ7 దేశాల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం గతంలో దిగుమతుల కోసం చేసుకున్న ఒప్పందాలకు వర్తించదు. కొత్తగా ఎలాంటి దిగుమతులు చేసుకోరాదని నిర్ణయించారు. రష్యా నుంచి 15.45 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారాన్ని ఈ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి.

ఈ నిర్ణయం నేరుగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గుండెకు తగులుతుందని బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా ఇప్పటికే తీసుకున్న పలు చర్యలకు ఇది అదనమని అమెరికా తెలిపింది. జీ7 దేశాలన్నీ ఈ నిర్ణయానికి అనుగుణంగా దిగుమతులను నిలిపివేయాల్సి ఉంటుందని అమెరికా స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement