Thursday, May 2, 2024

భారత స్టాక్‌మార్కెట్లపై విదేశీ మదుపరుల మోజు.. ఈనెల తొలివారంలో 14 వేల కోట్ల పెట్టుబడి..

భారత్‌ స్టాక్‌ మార్కెట్లపై విదేశీ మదుపరుల విశ్వాసం సన్నగిల్లలేదు. షేర్‌ మార్కెట్లలో భారీగా పెట్టుబడులు పెట్టారు. పెద్దఎత్తున షేర్లు కొనుగోలుచేశారు. ఈనెల మొదటి ఏడురోజుల్లో ఏకంగా రూ.14 వేల కోట్ల రూపాయలు మదుపు చేశారు. జులైతో పోలిస్తే రూ.5 వేల కోట్లు అనదంగా పెట్టుబడి పెట్టారన్నమాట. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒడిదొడుకులకు లోనవుతున్న నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారులు ముందుకురావడం గమనార్హం. దాదాపు ఏడునెలల పాటు పెట్టుబడులపై ఆచితూచి వ్యవహరించిన వీరు పెద్దఎత్తున షేర్లు విక్రయించారు. జులైనుంచి భారత్‌ మార్కెట్లవైపు సానుకూలంగా అడుగులు వేశారు. ఫలితంగా జులైలో వారు షేర్ల కొనుగోలుకు ప్రాధాన్యమిచ్చారు. 2021 అక్టోబర్‌ నుంచి జూన్‌ 2022 మధ్య కాలంలో వారు ఏకంగా రూ.2.46 కోట్ల విలువైన షేర్లు అమ్మేశారు. రూపాయి బలహీనపడినప్పటికీ, ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ఈసారి విదేశీ మదుపరులు భారతీయ ఈక్విటీ మార్కెట్‌పై పూర్తి నమ్మకంతో పెట్టుబడులు పెట్టారని, పెద్దఎత్తున షేర్లు కొనుగోలు చేశారని పేరుమోసిన ఈక్విటీస్‌ రంగంలో ప్రఖ్యాత విశ్లేషకుడు హితేష్‌ జైన్‌ చెప్పారు. భారత స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులకు సంబంధించిన తాజా గణాంకాల ప్రకారం ఆగస్టు తొలివారంలో రూ.14,172 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారని ఆయన తెలిపారు.

గతనెలలో డాలర్‌ విలువ అమాంతం 109 పాయింట్లకు పెరగిందని, అయితే ఆగస్టునాటికి106 పాయింట్లకు తగ్గిందని, అందుకు విదేశీ మదుపరుల పెట్టుబడులు పెరగడమే కారణమని ఆయన తెలిపారు. ఈ ట్రెండ్‌ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యూహకర్త వి.కె.విజయకుమార్‌ తెలిపారు. భారత స్టాక్‌మార్కెట్‌లలో ఇటీవల జరిగిన సానుకూల పరిణామాల నేపథ్యంలో పెట్టుబడులుకు విదేశీ మదుపరులు ముందుకొచ్చారు. ప్రత్యేకించి కేపిటల్‌ గూడ్స్‌, ఎఫ్‌ఎంసీజీ, నిర్మాణ, విద్యుత్‌ రంగాల్లోని షేర్లపై వారుఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. మరోవైపు రుణాల రంగంలో ఏకంగా 230 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం విశేషం. అంటే, ఆయా రంగాలకు చెందిన షేర్లను పెద్దఎత్తున కొనుగోలు చేశారన్నమాట. చైనా, తైవాన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో అక్కడి మార్కెట్లలో పెట్టుబడులు పెట్టినవారు భారత్‌వైపు మళ్లడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని మరికొందరు నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement