Saturday, May 18, 2024

రష్యా సావరీన్‌ రేటింగ్‌ను భారీగా తగ్గించిన ఫిచ్‌, మూడీస్ ..

ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీలు ఫిచ్‌, మూడీస్‌ తాజాగా రష్యా సావరిన్‌ రేటింగ్‌ను తగ్గించాయి. ఆరుస్థాయిల మేర జంక్‌స్థితికి తగ్గించాయి. పాశ్చాత్య ఆంక్షల రుణాన్ని అందించే దాని సామర్థ్యాన్ని సందేహానికి గురిచేశాయని, ఆర్థిక వ్యవస్థను బలహీన పరుస్తాయని పేర్కొంది. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో వివిధ దేశాల ఆంక్షల అనంతరం రష్యా ఆర్థిక మార్కెట్లులో గందరగోళం నెలకొంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపియన్‌ దేశంపై ఈ చర్యలు తీసుకోవడం చర్చనీ యాంశంగా మారింది. రష్యా ఉక్రెయిన్‌పై దండయాత్ర నేపథ్యంలో క్రెడిట్‌ రేటింగ్‌ కదలికలు రష్యా ఆర్థికవ్యవస్థపై ప్రభావం గురించి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

ఎస్‌అండ్‌పీ కూడా గతవారం రష్యా రేటింగ్‌ను జంక్‌స్థాయికి తగ్గించాయి. ఫిచ్‌రేటింగ్‌ రష్యాను బీబీబీ నుంచి బీకి, మూడీస్‌ రేటింగ్‌ను బీఎఎ3నుంచి బీ3కి తగ్గించింది. కాగా 1997లో ఒక సావరీన్‌ దేశం సౌత్‌కొరియాపై ఈస్థాయిలో అంటే ఆరుస్థాయిల మేర డౌన్‌ గ్రేడ్‌ చేసినట్లు ఫిచ్‌ వెల్లడించింది. ఉక్రెయిన్‌ పైన రష్యా సైనిక దండయాత్రకు ప్రతి స్పందనగా అంతర్జాతీయ ఆంక్షల తీవ్ర త స్థూల ఆర్థిక స్థిరత్వ ప్రమాదాలను పెంచిందని రష్యా క్రెడిట్‌ ఫండమెంటల్స్‌కు భారీ షాక్‌ ఇచ్చిందని ఫిచ్‌ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement