Thursday, May 16, 2024

ఫినాన్షియల్‌ బబులే… తులిప్‌ మానియా

ఆస్తులు.. మార్కెట్‌ లేదా రియల్‌ ఎస్టేట్‌ రంగాల వాస్తవ విలువను అధిగమించి వాటి ధరలు ఒక్కసారిగా పెరిగితే ఆ సందర్భాన్ని ఫినాన్షియల్‌ బబుల్‌గా పేర్కొంటారు. ఇటువంటి ఆర్థిక బుడగలు గురించి తెలిపేటప్పుడు ఆర్థిక నిపుణులు తులిప్‌ మానియాను ప్రస్తావిస్తారు. 17వ శతాబ్దంలో ఈ తులిప్‌ మానియా చోటు చేసుకుంది. ఆ కాలంలోని డచ్‌ ఇన్వెస్టర్లు తులిప్‌ పూలపంటలపై పెట్టుబడులు పెట్టడంతో వాటి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఒక్కో తులిప్‌ పువ్వు ధర ప్రతిభావంత కార్మికుడి వార్షిక ఆదాయం కంటే ఎక్కువగా పెరిగిపోయింది. ఆ విధంగా మూడేళ్లపాటు తులిప్‌ మానియా కొనసాగింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాటి ధర పడిపోవడంతో పెట్టుబడుదారులు కుదేలైపోయారు. వాస్తవానికి దూరంగా ఊహాజనిత ఆర్థిక బుడగల చరిత్రలో తులిప్‌ మానియా మొదటిది అని ఆర్థికరంగ నిపుణులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement