Wednesday, May 15, 2024

Finance | ఫ్లిప్‌కార్ట్‌లో పర్సనల్‌ లోన్‌.. యాక్సిస్‌ బ్యాంక్‌తో ఒప్పందం

ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఒకపై పర్సనల్‌ లోన్స్‌ ఇవ్వనుంది. ఇందుకోసం సంస్థ యాక్సిస్‌ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ రెండు సంస్థలు ఇప్పటికే కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును తీసుకు వచ్చాయి. ఇప్పుడు పర్సనల్‌ లోన్‌ విభాగంలోకి ప్రవేశించింది. ఈ ఒప్పందం ప్రకారం ఇక నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా యాక్సిస్‌ బ్యాంక్‌కు చెందిన పర్సనల్‌ రుణాలు పొందవచ్చు. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌లో 30 సెకన్లలోనే రుణ ఆమోదంతో 5 లక్షల వరకు తక్షణ ఎండ్‌ టూ ఎండ్‌ డిజిటల్‌ పర్సనల్‌ లోన్‌ పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఇలా పొందిన రుణాన్ని 6 నుంచి 36 నెలల వరకు చెల్లించవచ్చు.

- Advertisement -

తమ వినియోగదారులకు బ్యాంకింగ్‌ సంస్థలతో వ్యూహాత్మక సహకారంతో పర్సనల్‌ రుణాలు, బై నౌ పే లేటర్‌, ఈఎంఐ, కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్టుల వంటివి అందించామని ఫ్లిప్‌కార్ట్‌లో ఫిన్‌టెక్‌ అండ్‌ పేమెంట్స్‌ గ్రూప్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ధీరజ్‌ అనేజా తెలిపారు. కొనుగోలుదారుల అవసరాలను సులువుగా తీర్చుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ ఒప్పందం మూలంగా తమ రుణ వితరణ మరింత విస్తృతం కానుందని యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌, డిజిట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ప్రెసిడెంట్‌ సమీర్‌ శెట్టి తెలిపారు. 20 సెకన్లలోనే లోను ఇస్తామని ఈ రెండు సంస్థలు ప్రకటించాయి. లోను కావాలనుకే కస్టమర్లు తమ పాన్‌, పుట్టిన తేదీ వివరాలు, వృత్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement