Thursday, April 25, 2024

స్టాక్ మార్కెట్ – న‌ష్టాల‌లో దేశీయ మార్కెట్..

ముంబై – సోమవారం నాడు లాభాల బాట‌లో ప‌య‌నించిన స్టాక్ మార్కెట్ మంగ‌ళ వారం నాడు మాత్రం మ‌దుపుర‌ల‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గుచూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 631 పాయింట్లు కోల్పోయి 60,115కి పడిపోయింది. నిఫ్టీ 187 పాయింట్లు నష్టపోయి 17,914కి దిగజారింది. ఈనాటి ట్రేడింగ్ లో మెటల్, హెల్త్ కేర్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు మినహా మిగిలిన అన్ని సూచీలు నష్టాలను మూటకట్టుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (6.07%), పవర్ గ్రిడ్ (1.29%), టాటా స్టీల్ (1.15%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.81%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.71%).

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-2.92%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.09%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.76%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.59%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.53%).

Advertisement

తాజా వార్తలు

Advertisement