Friday, April 26, 2024

సైయింట్‌ చేతికి సిటెక్‌, 800 కోట్లకు డీల్‌ ఫైనల్ ..

ఫిన్‌లాండ్‌ కేంద్రంగా పని చేస్తున్న ఇంజినీరింగ్‌ సేవల సంస్థ సిటెక్‌ కంపెనీని.. ప్రముఖ ఐటీ కంపెనీ సైయింట్‌ కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం విలువ రూ.800 కోట్లు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 1984లో సిటెక్‌ను స్థాపించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 1,200 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇంధనం, మైనింగ్‌, ప్రాసెస్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, తయారీ పరిశ్రమలకు ఇది ఇంజినీరింగ్‌ సేవలను అందిస్తోంది. సైయింట్‌ ఇప్పటి వరకు చేసిన కొనుగోళ్లలో ఇదే అతిపెద్దది. ఈ త్రైమాసికంలోనే కొనుగోలు ప్రక్రియ పూర్తికానుంది. 2021లో సిటెక్‌ రూ.660 కోట్ల ఆదాయాన్ని నివేదించింది. అయితే ఈ డీల్‌కు సంబంధించి ఒప్పందపరమైన సంతకాల ప్రక్రియ కూడా పూర్తయినట్టు సైయింట్‌ లిమిటెడ్‌ సోమవారం తెలిపింది. ఈ త్రైమాసికంలోను కొనుగోలు ప్రక్రియ పూర్తి అవుతుందని వివరించింది. ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ కంపెనీల్లో ఇదే అతిపెద్ద కొనుగోలు ఒప్పందం అని తెలిపింది. సైయింట్‌ కంపెనీ చరిత్రలోనూ ఇది పెద్ద డీల్‌గా సదరు కంపెనీ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. సిటెక్‌ కంపెనీని కొనుగోలు చేయడంతో ఇంజినీరింగ్‌ సెక్టార్‌లో ఉత్పత్తి, ప్లాంట్‌ విస్తరణ పెరుగుతుందని అభిప్రాయపడింది. అదేవిధంగా ఎనర్జీ ఇండస్ట్రీ కూడా మరింత బలోపేతం అవుతుందని చెప్పుకొచ్చింది. క్లీన్‌ ఎనర్జీ ఉత్పత్తిపై మరింత దృష్టి సారించొచ్చని సైయింట్‌ లిమిటెడ్‌ తెలిపింది.

యూరోపియన్‌ దేశాల్లో…

యూరోపియన్‌ దేశాల్లోనూ సేవలు విస్తరిస్తాయని, నార్డోక్‌ దేశాలైన ఫిన్లాండ్‌, నారే, సీడన్‌, జర్మనీతో పాటు ఫ్రాన్స్‌లో మెరుగైన సేవలు అందుతాయని అభిప్రాయపడింది. సిటెక్‌ కంపెనీలు ఏకమవ్వడంతో.. ప్రపంచంలోనే అతిపెద్ద ఇండిపెండెంట్‌ ఇంజినీరింగ్‌ ప్లాంట్‌గా నిలవనుంది. ప్లాంట్‌ ఇంజినీరింగ్‌, డిజిటల్‌ సొల్యూషన్స్‌, ప్రొడక్‌ ్ట ఇంజినీరింగ్‌, కన్సల్టింగ్‌, టెక్నికల్‌ డాక్యుమెంటేషన్‌ వంటి సమగ్రమైన సేవలు, ఆఫర్‌లను వినియోగించుకోవడానికి కస్టమర్లకు అనుమతి లభిస్తుందని సైయింట్‌ తెలిపింది. ఉమ్మడి ప్లాంట్‌ ద్వారా అందే సేవల స్థాయి, నైపుణ్యం, వనరులు, కొత్త సామర్థ్యాలకు యాక్సెస్‌ను అందిస్తాయని అభిప్రాయపడింది. ఈ కొనుగోలు ఒప్పందం.. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పాదక సౌకర్యాలను కలిగి ఉన్న కొత్త కస్టమర్ల కోసం తమ కంబైన్‌ ్డ ప్లాంట్‌ ఇంజినీరింగ్‌, డిజిటల్‌ సొల్యూషన్స్‌ పోర్ట్‌ఫోలియోను తీసుకెళ్లడానికి అనుమతిస్తుందని సైయింట్‌ వివరించింది. సిటెక్‌ బలమైన బ్రాండ్‌ విలువ, టాలెంట్‌, ముఖ్యంగా నార్డిక్‌ ప్రాంతంలో వేగవంతమైన వృద్ధికి దోహదం చేస్తుందని సైయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ క్రిష్ణ బొడనపు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement