Thursday, May 2, 2024

జియోలోనూ చాయిస్‌ నంబర్‌.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల‌తో చాన్స్‌

వినియోగదారులకు నచ్చిన నంబర్లు ఎంచుకునే అవకాశం కల్పించేలా జియో సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ‘ఛాయిస్‌ నంబర్‌’ స్కీమ్‌ పేరుతో జియో తమ కస్టమర్లకు నచ్చిన నంబర్‌తో సిమ్‌ కార్డును కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించింది. ఈ స్కీమ్‌లో భాగంగా కొత్తగా జియో సిమ్‌ను కొనుగోలు చేయాలనుకొనే వారు ఫోన్‌నంబర్‌ చివరి నాలుగు నుంచి ఐదు అంకెలు ఎంచుకొనే స్వేచ్ఛను కల్పించింది. దీంతో జియో వినియోగదారులు తమకు నచ్చిన నంబర్‌ వచ్చేలా సిమ్‌కార్డ్‌ను తీసుకోవచ్చు. ఇంతకు ముందు వొడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమే ఇటువంటి సౌకర్యాన్ని అందించేవి. కొత్తగా రిలయన్స్‌ జియో కూడా ఈ జాబితాలో చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement