Wednesday, May 1, 2024

పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్రం షాక్‌.. ఎక్కువ ఆదాయం పొందేవారికి ట్యాక్స్

ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాదారులకు కేంద్రం షాక్‌ ఇచ్చింది. ఎక్కువ ఆదాయం పొందే ఉద్యోగులకు పన్ను విధించేందకు రంగం సిద్ధమవుతోంది. ప్రావిడెంట్‌ ఫండ్‌లో ఎంప్లాయీ కంట్రిబ్యూషన్‌పై పన్ను రాయితీలను తగ్గించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్లో ఈ అంశంపై కీలక ప్రతిపాదన చేశారు. అధిక ఆదాయం ఉన్న ఉద్యోగులు తమ ఆదాయంపై పన్ను మినహాయింపును సవరించడాకి కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌పై వచ్చే వడ్డీ మొత్తంపై ప్రస్తుతం ఎలాంటి పన్ను లేదు. ఈనేపథ్యంలో అధికశాతం ఉద్యోగులు ప్రావిడెంట్‌ ఫండ్లకు ఎక్కువ మొత్తంలో కంట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఇలా కంట్రిబ్యూట్‌ చేసిన మొత్తంపై వచ్చే వడ్డీపై కేంద్రం ఎలాంటి పన్ను ఇంతకుముందు విధించలేదు.

అయితే కేంద్ర ప్రస్తుతం పన్ను మినహాయింపు పరిమితిని విధించాలని నిర్ణయించింది. రూ.2.5లక్షలు దాటిన వార్షిక పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌పై లభించిన వడ్డీ మొత్తంపై పన్ను పడనుంది. ఒకవేళ ఉద్యోగులు పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ ఏడాదికి రూ.2.5లక్షలు ఉంటే ఎటువంటి పన్ను ఉండదు. రూ.2.5లక్షల పరిమితి దాటిన మొత్తంపై లభించే వడ్డీపైనే పన్ను విధిస్తారు. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ప్రతిపాదన అమలవనుంది. కాగా ప్రస్తుతం ఉద్యోగి జీతంలో 12శాతం పీఎఫ్‌ అకౌంట్‌కు వెళుతుంది. ఇంతే మొత్తంలో కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తారు. కేంద్రం విధిస్తున్న కొత్త నిబంధన కారణంగా పీఎఫ్‌లో ఎక్కువ మొత్తంలో జమచేసేవారి సంఖ్య తగ్గుముఖం పట్టనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement