Sunday, April 28, 2024

క్యాంపస్‌ యాక్టివేర్‌.. 26న ఐపీఓ బిడ్డింగ్‌ ప్రారంభం

క్యాంపస్‌ యాక్టివేర్‌ లిమిటెడ్‌ తమ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ను 2022, ఏప్రిల్‌ 26న ప్రారంభిస్తున్నది. ఐదు రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్‌ ప్రైస్‌ బ్యాండ్‌ను రూ.278 నుంచి రూ.292 మధ్య స్థిరీకరించారు. ఈ ఆఫర్‌లో భాగంగా.. 4,79,50,000 ఈక్విటీ షేర్లను విక్రయాలకు అందుబాటులో ఉంచారు. కనీసం 51 ఈక్విటీ షేర్లతో తమ బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్‌లో భాగంగా ప్రమోటర్‌ సెల్లింగ్‌ షేర్‌ హోల్డర్లు హరి కిషన్‌ అగర్వాల్‌.. 80,00,000 ఈక్విటీ షేర్లను, నిఖిల్‌ అగర్వాల్‌ 45,00,000 ఈక్విటీ షేర్లను విక్రయాలకు అందుబాటులో ఉంచనున్నారు. వీరితో పాటు 2,91,00,000 ఈక్విటీ షేర్లను టీపీజీ గ్రోత్‌ 3 ఎస్‌ఎఫ్‌ పీటీఈ లిమిటెడ్‌, 60,50,000 ఈక్విటీ షేర్లను ఓఆర్‌జీ ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌, 10,00,000 ఈక్విటీ షేర్లను రాజీవ్‌ గోయల్‌, 2,00,000 ఈక్విటీ షేర్లను రాజేశ్‌ కుమార్‌ గుప్తా (ఇతర సెల్లింగ్‌ షేర్‌ హోల్డర్లు) విక్రయించనున్నారు. జేఎం ఫైనాన్షియల్‌ లిమిటెడ్‌, బొఫా సెక్యూరిటీస్‌ ఇండియా లిమిటెడ్‌, సీఎల్‌ఎస్‌ఏ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, కొటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ లిమిటెడ్‌లు.. బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. బిడ్డింగ్‌ దాఖలు ఏప్రిల్‌ 26న ప్రారంభమై.. ఏప్రిల్‌ 28తో ముగుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement