Thursday, April 25, 2024

BMW నుంచి ఖరీదైన బైక్ విడుదల

ప్రముఖ వాహన తయారీ సంస్థ BMW గురువారం ప్రీమియం బైక్ మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘M 1000 RR’అనే ఈ మోడల్ బైక్ ధరను రూ. 42 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. ప్రీమియం ఫీచర్లతో లభించే ఈ బైక్ నాలుగు రకాల రైడింగ్ మోడ్స్‌లలో లభించనుంది. భారత్‌లోని BMW నుంచి వచ్చిన మొదటి ‘M మోడల్’ బైక్ ఇదని, దీన్ని BMW మోటారాడ్ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చని BMW గ్రూప్ ఇండియా వెల్లడించింది. ఈ బైక్ రెండు వేరియంట్లలో లభించనుండగా BMW M 1000 RR ధర రూ. 42 లక్షలు ఉండగా, BMW M 1000 RR కాంపిటీషన్ ధర రూ. 45 లక్షలతో లభిస్తుంది.

ఈ బైక్ మెరుగైన పనితీరుతో బైక్ రేస్ అనుభూతిని ఇస్తుందని BMW ఇండియా గ్రూప్ ప్రెసిడెంట్ విక్రమ్ పవా తెలిపారు. ఈ సరికొత్త మోడల్‌లో శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు అధునాతన డైజైన్, ప్రత్యేకమైన పరికరాలతో తయారు చేయబడిందని పేర్కొన్నారు. 999 సీసీ, 4-సిలిండర్ఇం జిన్‌తో నడిచే BMW M 1000 RR 0-11 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.1 సెకెన్లలో అందుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 3.6 కిలోమీటర్లని కంపెనీ తెలిపింది. ఇది రెయున్, రోడ్, డైనమిక్, రేస్ లాంటి నాలుగు రైడింగ్ మోడ్‌లలో లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement